మూడు పెళ్లిళ్లపై స్పందించిన పవన్.. వ్యామోహంతో ఆ పని చేయలేదు అంటూ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

 Pawan Kalyan About His Three Marriages Pawan Kalyan, Tollywood, Unstoppble Show,-TeluguStop.com

పవన్ సినిమాల విషయానికొస్తే గత ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నాడు.ఈ నేపథ్యంలోనే పవన్ హరిహర వీరమల్లు, భగవదీయుడు భగత్ సింగ్, తో పాటు సుజిత్,సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలలో నటిస్తున్నాడు.

ఒక సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.

Telugu Balakrishna, Balayya Babu, Harihara, Marriages, Pawan Kalyan, Tollywood,Telugu Balakrishna, Balayya Babu, Harihara, Marriages, Pawan Kalyan, Tollywood,

ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు షోలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు బాలయ్య బాబు నేరుగా మూడు పెళ్లిళ్ల విషయం గురించి ప్రశ్నించాడు.అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల పై స్పందిస్తూ.నేను బ్రహ్మచారిగా ఉండాలనుకున్నాను రిలేషన్ షిప్ లో కొన్ని కుదరవు కాబట్టి కొంతమంది విడిపోతారు.ప్రతిసారి మూడు పెళ్లిళ్లు అంటున్నారు నేను మూడు పెళ్లిళ్లు ఒకేసారి చేసుకోలేదు.

అలాగే ముగ్గురి తోను ఒకేసారి ఉండడం లేదని చెబుతాను.వ్యామోహంతో నేను అలా చేయలేదు.

అలా జరిగాయి అంతే.రాజకీయంలో ఉన్నాను కాబట్టి ప్రతిసారి నన్ను విమర్శించడం కోసం దానిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు అని తెలిపాడు పవన్ కళ్యాణ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube