వీరమల్లు కోసం ఏకంగా 30 సార్లు పవన్ చేంజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నహరిహర వీరమల్లు కూడా ఒకటి.ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, ఒక్కసారిగా ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

 Pawan Kalyan 30 Different Costumes In Harihara Veeramallu-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకుడు ఈ సినిమాను ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే మనకు ఇట్టే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో పవన్ లుక్‌ను చాలా ప్రత్యేకంగా చూపించేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన్ను ఈ సినిమాలో ఏకంగా మూడు విభిన్న లుక్స్‌లో ప్రేక్షకులకు చూపించేందుకు దర్శకుడు క్రిష్ రెడీ అవుతున్నాడు.

ఇందుకోసం పవన్ ఏకంగా 30 కాస్ట్యూమ్స్ మార్చనున్నట్లు తెలుస్తోంది.ఈ రేంజ్‌లో పవన్‌ను ఇంతకుముందు ఏ దర్శకుడు చూపెట్టకపోవడంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

వారు కూడా ఊహించని విధంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఉండటంతో ఈ సినిమాతో పవన్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే పవన్ లుక్స్ ఈ సినిమాకు కీలకం కానున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.వీరమల్లు పాత్రలో పవన్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అంతేగాక ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అదిరిపోయే సంగీతం అందించనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.మొత్తంగా హరిహర వీరమల్లు చిత్రం పవన్ కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ చిత్రంగా నిలవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube