ఒకే సారి మూడు సినిమాలు.. ఈతరం స్టార్‌ హీరోల్లో పవన్ కు మాత్రమే ఈ ఘనత దక్కింది

పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాత వాసి తర్వాత సినిమాలు చేయడనే వార్తలు వచ్చాయి.పవన్‌ కూడా ఒకటి రెండు సందర్బాల్లో నాకు సినిమా లపై కంటే ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పుకొచ్చాడు.

 Pawan Kalyan 3 Movies On Sets At Present-TeluguStop.com

సినిమా లు చేయడం కంటే ప్రజల సమస్యలపై పోరాటం చేయడం కోసం ఎక్కువగా ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించిన పవన్‌ ఆర్థిక పరమైన కారణాల వల్ల మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు.జనసేన పార్టీని నడిపించాలన్నా తన కుటుంబం ను సంతోషంగా ఉంచాలన్నా కూడా మళ్లీ సినిమాలు చేయాలని పవన్ భావించాడు.

అనుకున్నదే తడువుగా ఏకంగా నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు.ఆ తర్వాత మరో రెండు మూడు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు.

 Pawan Kalyan 3 Movies On Sets At Present-ఒకే సారి మూడు సినిమాలు.. ఈతరం స్టార్‌ హీరోల్లో పవన్ కు మాత్రమే ఈ ఘనత దక్కింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలకు అయితే ఓకే చెబుతున్నాడు కాని ఈయన వీటన్నింటిని పూర్తి చేస్తాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.అయితే అన్ని సినిమాలను కూడా ఈయన పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రచారం ఇప్పటికే వకీల్‌ సాబ్ పూర్తి అవ్వగా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ను సగానికి పైగా పూర్తి చేశాడు.ఆ సినిమా తర్వాత పవన్‌ క్రిష్‌ దర్శకత్వంలో సినిమా ను కూడా మొదలు పెట్టాడు.

ప్రస్తుతం అదే సినిమా షూటింగ్‌ జరుపుతున్నారు.మరో వైపు హరీష్‌ శంకర్‌ సినిమా ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో పవన్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సెట్టింగ్‌ ల నిర్మాణం ప్రారంభం అయ్యింది.పవన్‌ కు ఆప్తుడిగా పేరున్న ఆనంద్‌ సాయి సారథ్యంలో పెద్ద ఎత్తున సెట్టింగ్‌ లను నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో భారీ సెట్టింగ్‌ రూపొందబోతుంది.

అంటే ఏప్రిల్‌ వరకు పవన్‌ హరీష్‌ శకర్‌ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.అంటే ఒకే సారి మూడు సినిమాలు పవన్‌ సెట్స్‌ పై ఉండబోతున్నాయి.

ఈ తరం స్టార్‌ హీరోల్లో ఒకే సారి మూడు సినిమాలు చేస్తున్న ఘనత ఎవరు దక్కించుకోలేక పోయారు.పవన్‌ కు మాత్రమే ఈ రికార్డు దక్కింది.

.

#Anand Sai Movie #On Sets #Pawan Kalyan #PawanHarish #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు