టీడీపీ ఓట్లు అడగడానికి వస్తే నిలదీయండి...”బాబు , పవన్”ల స్కెచ్     2018-01-27   21:47:49  IST  Bhanu C

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణా నుంచీ తన రాజకీయ యాత్ర మొదలు పెట్టాడు.అయితే దీనికి కారణం మాత్రం అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడేలా చేయడానికే అని ఎంతో క్లియర్ గా అర్ధం అయ్యింది ఎందుకంటే..ఒకానొక సమయంలో కేసీఆర్ ని అమ్మనా బూతులు తిట్టినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేసీఆర్ స్మార్ట్ అంటూ పొగడటం పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి…ఇదిలా ఉంటే పవన్ తెలంగాణా టూర్ లో ఉన్నప్పుడే ఒక ఏపీలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. .ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు సీమలో ఎన్నో కన్నీళ్లుఉన్నాయి అంటూ సినిమా డైలాగులు చెప్పిన పవన్ అక్కడ అభివృద్ధి జరుగుతున్నా సరే ఎందుకు అలా మాట్లాడాడు అంటూ ఆరోజు ఆ వ్యాఖ్యలు విన్న అందరు అనుకున్నారు.

ఇదిలా ఉంటే ఒక పార్టీ ఎక్కడైనా సరే విజయం సాధించాలి అంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ తప్పులు చేయాలి..ప్రజలని పట్టించుకోకుండా ఉండాలి..అయితే పవన్ కళ్యాణ్ నిన్న అనంతపురం టూర్ లో మాట్లాడుతూ మీ భాదలు పోగొట్టడానికే నేను వచ్చాను అన్నారు..కరువు సీమలో సిరులు పండేలా చేస్తా మీ భాదలు..మీ కోర్కోలకి న్యాయం జరిగేలా చేస్తా అంటూ భారీగా నే మాట్లాడారు అంతేకాదు అంటూ డైలాగులు చెప్పినా ఇక్కడే ఎన్నో భాదలు ఉన్నాయి అంటూ నిన్న జరిగిన మీటింగ్ లో భాగంగా తెలిపారు..అయితే నిన్నా మొన్నటి వరకూ చంద్రబాబు ని వెయ్యినోళ్ళ పొగిడిన కళ్యాణ్ బాబు ఒక్కసారిగా స్వరం మార్చేశారు..అనంతపురం కి అన్యాయం జరుగుతుంది అంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనేకదా..? అనంతపురం కోసం కేంద్రానికి వెళ్లి ప్రధానితో మాట్లాడుతా అంటే చంద్రబాబు చేతకాని వాడు అని పవన్ అభిప్రాయమా..? ఏపీలో సమస్యలు ఉంటే ఏపీ ప్రభుత్వానికి తెలియచేయాలి కానీ ఆ మాట మాట్లాడకుండా చంద్రబాబు ని డైరెక్ట్ గా విమర్సించుకుండా..పవన్ కేంద్రం పై ఫైర్ అవుతున్నారు…కానీ ఈ విషయంలో పెద్ద జిమ్మిక్కే ఉంది..అదేంటంటే

కేసీఆర్ ని పవన్ పొగడ్తలతో ముంచెత్తినప్పుడే పవన్ పెద్ద డమ్మీ అనీ అందరికి ఓ అభిప్రాయం వచ్చేసింది..ఏపీ ప్రజలకి మాత్రం పవన్ ఓ అవకాశవాది అని అర్థం అయిపొయింది..ఇతని గురించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అనుకున్నారు అయితే…వెంటనే చంద్రబాబు ఓ ప్లాన్ వేశారు..అక్కడ కేసీఆర్ ని పోగిడినట్టుగానే ఏపీలో చంద్రబాబు ని పొగిడితే మొదటికే మోసం వస్తుందని అనుకున్న బాబు విమర్శలు చేయండి అన్నట్టుగా సిగ్నల్స్ ఇవ్వడంతో నిన్న టూర్ లో పవన్ రెచ్చిపోయాడు…నిన్న పవన్ అనంతపురం సభలో మాట్లాడుతూ..

2019లో వచ్చే ఎన్నికలకి ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు వస్తే మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడగండి..మాకేం చేశారు అని చెప్పి నిలదీయండి..మాకోసం మీ మ్యానిఫెస్టో లో పెట్టిన అంశాలు ఎందుకు నెరవేర్చలేక పోయారు అని చెప్పి ప్రశ్నించండి అని అన్నాడు పవన్ కళ్యాణ్ ..అంటే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేనిది అధికారంలో ఉన్న పార్టీలే కదా మరి పవన్ అన్న వ్యాఖ్యలు ఎవరికి తగులుతాయి..? చంద్రబాబు ప్రభుత్వానికే తగులుతాయి కదా..? మరి ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా..బాబు ఎందుకు పట్టించుకోవడం లేదు..? ప్రతిపక్షాలు పవన్ అన్న మాటలే అంటే ముప్పేట దాడి చేసే బాబు సైనికులు ఎందుకు సైలెంట్ అయ్యారు..అంటే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది పవన్ మాటల వెనుక బాబు డైరెక్షన్ ఉందని…అందరికీ అర్థం అవుతోంది ఇదంతా ప్రజలముందు పవన్ ,బాబు లు ఆడుతున్న పెద్ద నాటకమని ఇదే విశ్లేషకుల విశ్లేషణ కూడా