ఒక్కసారే రెండు చేస్తున్న పవన్ కళ్యాణ్‌.. అభిమానులకు త్వరలో గుడ్‌ న్యూస్ ఖాయం  

pawan kalyan 2 movies shooting started at a time , krish, pawan kalyan, pawan kalyan vakeel sab, pspk28, sagar chandra, telugu flim news - Telugu Krish, Pawan Kalyan, Pawan Vakeel Saab, Pspk28, Sagar Chandra, Telugu Film News

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన ‘వకీల్‌ సాబ్‌’ షూటింగ్ కు ఇటీవలే గుమ్మడి కాయ కొట్టిన విషయం తెల్సిందే.వరుసగా సినిమాలకు కమిట్‌ అయిన పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రెండు సినిమా ల షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

TeluguStop.com - Pawan Kalyan 2 Movies Shooting Started At A Time

ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో పవన్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో భారీ ఎత్తున సెట్టింగ్ లను క్రిష్‌ వేయిస్తున్నాడు.

అక్కడ షూటింగ్ లను నిర్వహించేందుకు సిద్దం అయ్యారు.ఇటీవలే కొన్ని సీన్స్ చిత్రీకరణ జరిగింది.

TeluguStop.com - ఒక్కసారే రెండు చేస్తున్న పవన్ కళ్యాణ్‌.. అభిమానులకు త్వరలో గుడ్‌ న్యూస్ ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరో వైపు సాగర్‌ చంద్ర దర్శకత్వంలో పవన్‌ మలయాళ సినిమా అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా ను రీమేక్‌ చేస్తున్నాడు.రానా మరో హీరోగా నటించబోతున్న సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.

ఈ రెండు సినిమాలు కూడా ఒకే సారి పట్టాలెక్కడంతో పాటు షూటింగ్ కూడా సమాంతరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ రెండు సినిమాలు కూడా జూన్‌ లేదా జులై నెలలోనే పూర్తి అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

వరుసగా పవన్‌ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాకు తక్కువ డేట్లను కేటాయిస్తున్నాడు.అందుకే ఈ రెండు సినిమాలు కూడా మొత్తంగా 100 రోజులకు మించి డేట్లు ఇవ్వలేదు.

ఈ వంద రోజుల్లోనే రెండు సినిమాలు షూటింగ్‌ జరుగుతుంది.ప్రస్తుతం రెండు సినిమా లకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం అయిన నేపథ్యంలో త్వరలోనే పవన్‌ అభిమానుల కోసం ఫస్ట్‌ లుక్ లేదా మరేదైనా అప్‌ డేట్‌ ను యూనిట్‌ సభ్యులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా హరీష్‌ శంకర్‌ మరియు సురేందర్‌ రెడ్డి సినిమాలకు కూడా పవన్‌ కమిట్‌ అయ్యాడు.కనుక ఆ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

#Pawan Kalyan #PSPK28 #Krish #Sagar Chandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు