ఎన్నికల వరకు పవన్‌ పది సినిమాలు టార్గెట్‌

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే.దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ మూవీ పింక్‌ రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

 Pawan Kalyan Going To Do 10 Films Before Ap Assembly Elections , Ap Assembly Ele-TeluguStop.com

ఆ సినిమాను ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉండగా కరోనా ఆటంకంగా మారింది.కరోనా కారణంగా షూటింగ్ ఇంకా పూర్తి అవలేదు.

త్వరలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.వకీల్‌సాబ్ సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ఇంకా పలు సినిమాలకు ఓకే చెప్పాడు.

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చాయి.ఈ మూడు సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా రాబోతుంది.

పవన్ ఆప్తమిత్రుడైన రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే కాకుండా బాబీ మరియు డాలీ సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు.

తాజాగా బండ్ల గణేష్ కు కూడా సినిమా చేద్దాం అంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఇందుకు సంబంధించిన సినిమా ప్రకటన కూడా అతి త్వరలో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

బండ్ల గణేష్ ఇప్పటికే పలువురు దర్శకుల వద్ద కథలు వింటున్నాడు.పవన్ కు సూట్ అయ్యే కథ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు.

కచ్చితంగా వచ్చే ఏడాది చివరి వరకు లేదా 2022 లో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ఇలా రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ మినిమం 10 సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.తద్వారా కనీసం వంద కోట్లు అయినా వెనక వేసుకోవాలని ప్లాన్ గా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆర్థిక అవసరాల నిమిత్తమే సినిమాలు చేస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూనే వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న ఓ సినిమా చేయబోతున్నాడు.పవన్‌ వరుస సినిమాల కారణంగా ఆయన అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube