పవన్ రాపాక మధ్య ఇంత జరిగిందా ?  

Is This What Happened Between Pawan And Rapaka-pawan And Rapaka,rapaka,rapaka Vara Prasad,ys Jagan,ysrcp

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులందరూ ఓటమి చెందినా రాజోలు నుంచి గెలిచి రాపాక వరప్రసాద్ ఒకే ఒక్కడు గా పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ ఒకే ఒక్కడు తో అసెంబ్లీలో జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని పవన్ ముందు నుంచి భావిస్తూ వస్తున్నారు.

Is This What Happened Between Pawan And Rapaka-Pawan Rapaka Rapaka Vara Prasad Ys Jagan Ysrcp

అయితే రాపాక మాత్రం అధినేత పవన్ కళ్యాణ్ ను అస్సలు లెక్క చేయడం మానేశారు.అదే సమయంలో జగన్ కు జై కొడుతూ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తూ, నియోజకవర్గంలోని జగన్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ పవన్ కు ఇబ్బందికరంగా మారాడు.

ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేక, అలా అని చూస్తూ ఊరుకోలేక జనసేన పార్టీ సతమతమవుతోంది.చివరకు ఆయనను బహిరంగ లేఖ ద్వారా అభ్యర్ధించాల్సిన పరిస్థితి పవన్ కు వచ్చింది.

ఏపీ లు మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చ జరిగే సందర్భంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ బహిరంగ లేఖను రాపాక వార ప్రసాద్ కు రాశారు.అయినా ఆయన మాత్రం జగన్ నిర్ణయానికి ఓటు వేశారు.

అయితే తన సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఇలా బహిరంగ లేఖ పవన్ లేఖ రాయడం పై అనేక విమర్శలు, అనుమానాలు కలుగుతున్నాయి.సొంత ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతుంది కదా, పార్టీ తరఫున మీ గొంతును వినిపించాలని కోరొచ్చు కదా అనే సలహాలు కూడా పవన్ కు వచ్చాయి.

కానీ పవన్ అలా చేయకుండా బహిరంగ లేఖ రాశారు.దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.సొంత పార్టీ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాయడం కంటే ఫోన్ చేసి లేక దగ్గరకు పిలిపించుకుని పార్టీ విధానం గురించి, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై వివరంగా చెప్పి ఉంటే సరిపోయేది.

వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాపాక మధ్య అంత సాన్నిహిత్యం ఎప్పుడో పోయింది.మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ జగన్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి మరింతగా జనసేనకు రాపాక దూరమయ్యారు.ఇప్పుడు జగన్ కు ఓటు వేసి తన అభిప్రాయం ఏంటో చెప్పకనే చెప్పేశారు.

తెలుగుదేశం పార్టీ లో వల్లభనేని అప్పట్లో ఎలా ఇబ్బందికరంగా మారాడో ఇప్పుడు రాపాక కూడా పవన్ కు అదేవిధంగా ఇబ్బందికరంగా మారాడు.

తాజా వార్తలు

Is This What Happened Between Pawan And Rapaka-pawan And Rapaka,rapaka,rapaka Vara Prasad,ys Jagan,ysrcp Related....