అలా ... చక్రం తిప్పుదాం ! ఇలా అధికారం చేపడదాం

ఏపీలో కొత్తగా పుట్టుకొచ్చిన జనసేన పార్టీ … అప్పుడే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.మొదట్లో అసలు పార్టీ పెట్టినా… ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేనట్టుగా చెప్పిన జనసేన అధినేత పవన్ ఆ తరువాత ఎన్నో కొన్ని సీట్లు వస్తే చాలు అన్నట్టు గా … మాట్లాడాడు.

 Pawan Janasena No Allinece In 2019 Elections-TeluguStop.com

ఆ తరువాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు రావడం… అక్కడ తక్కువ సీట్లు సాధించిన కుమారస్వామి పార్టీ జేడీఎస్ అనూహ్యంగా… అధికారం చేపట్టడమే కాకుండా సీఎం పీఠం కూడా దక్కించుకోవడంతో… అంతా ఆశ్చర్యపోయారు.ఇక అప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో కూడా అనూహ్య మార్పు కనిపిచింది.

కొద్దిగా కష్టపడితే చాలు సీఎం పీఠం దక్కించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు అని బలంగా నమ్మాడు పవన్.

గత ఎన్నికల్లో అంటే 2014లో బీజేపీ-టీడీపీ కూటమి కి మద్దతిచ్చిన జనసేన.వచ్చే ఎన్నికల్లో మాత్రం సొంతగానే బరిలోకి దిగాలని చూస్తోంది.కాకపోతే కొద్దిరోజులుగా.

టీడీపీ నాయకులు జనసేన-వైసీపీలు పొత్తు పెట్టుకుంటున్నాయని విస్తృతంగా… ప్రచారం చేశారు.అంతే కాదు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కూడా ప్రచారం ఊపందుకుంది.ఈ నేపథ్యంలోనే జనసేనలో అంతర్మథనం ప్రారంభమైంది.“2014 నాటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాం.2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.ఇక మనం ఎప్పుడు ఎదగాలి అంటూ… జనసేన నేతలు కొందరు పవన్‌కళ్యాణ్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

తాజాగా పవన్‌కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రకటన చేయడంతో జనసేన ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు చూస్తోందని క్లారిటీ వచ్చేసింది.ఈ ప్రకటనతో జనసేన విధానం అందరికి అర్ధం అయిపొయింది.అందుకే… ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపై జనసేన దృష్టిపెట్టగా, కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమయ్యేందుకు ప్రయత్నిస్తోంది.జనసేన పాత్ర కీలకంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ మరో జేడీఎస్ మాదిరిగా తక్కువ స్థానాల్లో గెలిచినా….

అధికార పార్టీని నిర్ణయించే ఛాన్స్ ఉంది.దీనికి తోడు ఇటీవల పవన్ సైతం తాను ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు అంటూ … కర్ణాటకలో జేడీఎస్ ప్రస్తావన కూడా తీసుకు వస్తున్నారు.

ఇప్పుడు ఈ విషయం తెలిసిన వారు జనసేనను .ఏపీ జేడీఎస్ అంటూ పిలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube