జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా మండిపడ్డారు.పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలన్నారు.
ఎమ్మెల్యే కాకుండా సీఎం ఎలా అవుతారని ప్రశ్నించిన మంత్రి సీదిరి ముఖ్యమంత్రి కావాలంటే 88 మంది ఎమ్మెల్యే లు గెలవాలని చెప్పారు.అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనప్పుడు సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు.
పవన్ వ్యాఖ్యల వెనుక సీరియస్ నెస్ లేదన్నారు.పవన్ మాటలకు చేతలకు పొంతన ఉండదని విమర్శించారు.
నిలకడ లేని నేత పవన్ అని ఎద్దేవా చేశారు.వైసీపీ రహిత ఏపీ ఎందుకు చేయాలో పవన్ చెప్పాలని మంత్రి సీదిరి డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు వంత పాడటమే పవన్ చేసిన మొదటి తప్పని పేర్కొన్నారు.ఈ క్రమంలో చంద్రబాబు వెనుక వెళ్తే ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేరని తెలిపారు.
జగన్ ను తిట్టడమే పవన్ ఎజెండా అంటూ ధ్వజమెత్తారు.