ఆయ‌న ఎంట్రీపై జనసేనలో అప్పుడే అనుమానాలు

జనపార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో రాజకీయ దూకుడు కూడా బాగా పెంచాడు.

 Pawan Invites Veteran Tdp Leader Dadi To Join Janasena-TeluguStop.com

దీనిలో భాగంగానే… పార్టీలోకి కీలకమైన నేతలను ఆహ్వానిస్తూ పనిలోపనిగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నాడు.ఇప్పటికే బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ- వైసీపీలను ఎదుర్కోవడం అంత సులువు కాకపోయినా.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో జనసేన గెలిచే స్థానాలే కీలకం అవుతాయని పవన్ భావిస్తున్నాడు.అందుకే కనీసం 50-60 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఇందుకు ఉత్తరాంధ్ర జిల్లాలను ఆయుధంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ అయ్యారు.ఈ భేటీలో పవన్ దాడిని జనసేనలోకి ఆహ్వానించారు.అందుకు దాడి తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

అయితే ఇప్పుడు దాడి జనసేనలో చేరిపోయారు.ఇప్పటికే పలు పార్టీ మారిన దాడి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు.

కానీ ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా ఆయన మళ్లీ యాక్టీవ్ అయినట్లు తెలుస్తోంది.

కానీ దాడి జనసేనలో చేరారో లేదో అప్పుడే అనేక అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే పలుపార్టీలు మారిన దాడి వీరభద్రరావు జనసేనలోనైనా ఉంటారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీనికి కారణం లేకపోలేదు.ఉత్తర కోస్తాలో మాజీ మంత్రి దాడివీరభద్రరావు బలమైన నాయకుడనే పేరుంది.ఆ పేరుతోనే కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు.

టీడీపీ లో అధినేత చంద్రబాబు దాడికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఆ తరువాత గత ఎన్నికల కంటే ముందుగా వైసీపీ లో చేరారు.

అక్కడ ఇమడలేక 2015లో వైసీపీ నుంచి భయటకు వచ్చారు.

దీంతో గత కొద్దికాలంగా దాడి వీరభద్రరావు, అతని కుమారుడు రత్నాకరరావు సైలెంట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీనే దిక్కు అన్నట్టుగా కనిపించడంతో ఇప్పుడు ఆ పార్టీలో చేరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని దాడి భావిస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు రత్నాకర్ పవన్ కి సంకేతాలు ఇవ్వడం పవన్ వారి ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి.అయితే ముక్కుసూటితనం, సీనియర్ రాజకీయ నాయకుడు అనే హోదా ఉండడంతో పవన్ తో ఆయనకు సెట్ అవ్వుద్దా .? కొద్దీ రోజులు పార్టీలో ఉండి పవన్ మీద ఏదైనా ఆరోపణలు చేసి బయటకి వచ్చేస్తే పార్టీ పరువు ఏమవ్వాలి అని జనసేన నాయకులు, పవన్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube