జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) వారాహి యాత్ర ద్వారా ఉభయగోదావరి జిల్లాలో పెద్ద సంచలనమే సృష్టించారు.ఇక మూడో విడత వారాహి యాత్రను ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు.
వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మూడో విడత ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కాబోతోంది.ఈ యాత్ర ద్వారా జనసేనకు, పవన్ కళ్యాణ్ కు మంచి రాజకీయ మైలేజ్ దక్కిందనే చెప్పవచ్చు.
నేడు విజయవాడ( Vijayawada )కు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు.ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు .మూడో విడత వారాహి యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, తేదీ ఖరారు వంటి విషయాల పైన కీలకంగా చర్చించబోతున్నారు.ముందుగా మూడో విడత వారాహి యాత్రను ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టాలని పవన్ భావించినా, ఇప్పుడు ఆ విషయంపై పార్టీ కీలక నేతలతో చర్చించబోతున్నారు.

మూడో విడత యాత్రను పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టాలా లేక ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలా అనే విషయంపై కీలకంగా చర్చించనున్నారు.మూడో తేదీ లేదా 5వ తేదీన మూడో విడత వారాహి యాత్ర చేపట్టాలనే విషయంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుపోతున్నారు .గోదావరి జిల్లాల నుంచి వైసీపీ</em( YCP party ) నుంచి విముక్తి కలిగించాలనే నినాదంతో పవన్ వారాహి యాత్రను మొదలుపెట్టారు.ఈ రెండు జిల్లాలోనూ జనసేన( Janasena Party )కు ఊహించని స్పందన దక్కడం, చేరికలు జోరు అందుకోవడం, వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ సీట్లు ఈ రెండు జిల్లాల నుంచి దక్కే అవకాశం ఉండడం వంటివన్నీ పవన్ కు ఈ యాత్ర ద్వారా కలిసి వచ్చాయి.
ఒకపక్క వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే, రాజకీయంగా జనసేనను బలోపేతం చేసే విషయం పైన పవన్ దృష్టి సారించారు.

మొదటి, రెండో విడత వారాహి యాత్ర కు మించి పగడ్బందీగా మూడో విడత యాత్రను చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.జూన్ 14న కత్తిపూడి నుంచి మొదటి విడత వారాహి యాత్ర ప్రారంభమైంది.అదే నెల 30న భీమవరంతో వారాహి యాత్ర ముగిసింది .ఇక జూలై 9న ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభమై 14వ తేదీన తణుకు సభతో ముగిసింది.ఇక మూడో విడత యాత్ర విషయంపైనే చర్చించేందుకు తేదీని ఖరారు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తున్నారు.
మరికొద్ది రోజుల్లోనే యాత్రను ప్రారంభించబోతున్నారు.ఈరోజు దానికి సంబంధించిన తేదీ ఖరారు కాబోతుండడంతో జనసేన నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది