గ్రేట‌ర్లో జ‌న‌సేన ఓట్లు ఎవ‌రికి.... త‌గ్గిన ప‌వ‌న్ ఇమేజ్‌..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ దూకుడు ఎలా ఉంటుంది ?  తెలంగాణ రాజ‌కీయాల్లో బీజేపీకి తొలిసారి మ‌ద్ద‌తు ఇస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యూహం ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది ?  ఇప్పుడున్న వాతావ‌ర‌ణాన్ని ప‌వ‌న్ మార్చేస్తారా ? ఇవీ.ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు.

 Who Can Gets Janasena Votes In Ghmc Elections, Kapu Vote Bank, Janasena, Telanga-TeluguStop.com

ఏపీలో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదుర్కొన్న జ‌న‌సేనాని ప‌వ‌న్  ఇప్పుడు గ్రేటర్ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్దతు దారుగా మారారు.వాస్త‌వానికి తానే సొంత‌గా 50 డివిజ‌న్ల‌లో పోటీ చేస్తాన‌ని తొలుత ఆయ‌న ప్ర‌క‌టించారు.

దీనిని బీజేపీ కూడా సీరియ‌స్‌గా తీసుకోలేదు.పోతే.పోనీ.అన్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించింది.

అయితే, ఇంత‌లోనే కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన సంకేతాల నేప‌థ్యంలో ప‌వ‌న్ ఇప్పుడు క‌మ‌ల‌ద‌ళంతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు.అంతేకాదు.

తాను, త‌న పార్టీ కూడా గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేది కూడా లేద‌ని స్ప‌ష్టం చేశారు.స‌రే! ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.

ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ స‌త్తా చూపిస్తారా?  క‌మ‌లం ద‌ళం ఆశ‌ల‌ను ఆయ‌న నెర‌వేరుస్తారా? అనేది మాత్రం స‌స్పెన్స్‌గానే ఉంది.దీనికి కార‌ణం.

మిశ్ర‌మ ఓటు బ్యాంకు ఇక్కడ ప‌నిచేస్తోంది.

Telugu Janasainiks, Janasena, Kapu Vote Bank, Kishan Reddy, Pawandamage, Pawan K

ఏపీకి చెందిన సెటిల‌ర్లు ఉన్న‌ప్పటికీ.ఏపీలో ప‌వ‌న్ చూపిస్తున్న కొన్ని రాజ‌కీయ ఎత్తుగ‌డులు వారికి న‌చ్చ‌డం లేదు.ప్ర‌త్యేక హోదాపై ఉద్య‌మం అన్న ప‌వ‌న్‌.

త‌ర్వాత దానిని వ‌దిలేశారు.రాజ‌ధాని అమ‌రావ‌తిని నిలుపుకొనేందుకు ఉద్య‌మం చేస్తాన‌న్న జ‌న‌సేనాని దానిని కూడా బీజేపీతో క‌లిసిన త‌ర్వాత వ‌దిలేశారు.

పైగా.గ్రేట‌ర్ ఎన్నిక‌ల ముంగిట‌.

అస‌లు మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌నే చేయ‌లేదు.అన్నారు.

ఈ ప‌రిణామాలతో హైద‌రాబాద్‌లోని సెటిల‌ర్ల‌లో ప‌వ‌న్‌పై ఇమేజ్ త‌గ్గింది.ఇక‌, కాపు ఓటు బ్యాంకు. టీడీపీకి ప‌డుతుంద‌ని అంటున్నారు.యువ‌త ఓటు వేసే వ‌ర‌కు అవ‌కాశం త‌క్కువే.

ఈ ప‌రిణామాల‌ను విశ్లేషిస్తే.ప‌వ‌న్ ప్ర‌భావం త‌క్కువేన‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.

మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube