ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ హీరోయిన్... వెల్కమ్ చెప్పిన రవితేజ!

ఒకప్పుడు తెలుగు, తమిళ, మళయాళ భాషలలో ఫ్యామిలీ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ, జగపతి బాబు, బాలకృష్ణ, శివాజీ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Pawan Heroine Re Entry Into The Industry Raviteja Welcome Her, Meera Jasmine, Tollywood, Heroine, Film Industry, Re Entry,-TeluguStop.com

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీరాజాస్మిన్ 2014లో దుబాయ్ కి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మీరాజాస్మిన్ ఇండస్ట్రీకి దూరమైన తరువాత చాలామంది ఈమెను ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరారు.

 Pawan Heroine Re Entry Into The Industry Raviteja Welcome Her, Meera Jasmine, Tollywood, Heroine, Film Industry, Re Entry, -ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ హీరోయిన్#8230; వెల్కమ్ చెప్పిన రవితేజ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం మీరాజాస్మిన్ తన భర్తతో కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల తన భర్త నుంచి విడిపోయి తిరిగి ఇండస్ట్రీ లోకి రావాలని భావిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన మీరాజాస్మిన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయగానే ఎంతో మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు హీరోయిన్ మీరా జాస్మిన్ కు ఇండస్ట్రీలోకి వెల్ కమ్ చెప్పారు.ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా నటి మీరా జాస్మిన్ కి వెల్కమ్ చెప్పారు.వీరిద్దరూ కలిసి భద్ర సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా మంచి హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నారు.మలయాళంలోకి రీ ఎంట్రీ ఇస్తూ నా ఫాన్స్ కి దగ్గరవడం కోసమే ఇన్స్టా లో అడుగు పెట్టాను అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగులోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Pawan Heroine Re Entry Into The Industry Raviteja Welcome Her, Meera Jasmine, Tollywood, Heroine, Film Industry, Re Entry, - Telugu Meera Jasmine, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube