‘గబ్బర్‌సింగ్‌’ కాంబో మూవీ అప్‌డేట్‌కు ముహూర్తం ఫిక్స్

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్‌ సింగ్‌.ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో వెంటనే వారిద్దరి కాంబోలో మరో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

 Pawan Kalyan, Harish Shankar, Gabbar Singh Combo, Pawan And Harish Shankar Movie-TeluguStop.com

సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌కు హరీష్‌ శంకర్‌తో డైరెక్షన్‌ చేయిస్తే బాగుండేదనే అభిప్రాయం చాలా మందికి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల గబ్బర్‌సింగ్‌ కాంబో ఇన్నాళ్ల పాటు సెట్‌ అవ్వలేదు.

ఎట్టకేలకు వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

పవన్‌ 28వ చిత్రంగా రూపొందబోతున్న చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరిగింది.

అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ వ్యవహరించబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇతర అప్‌డేట్‌ ఏమీ రాలేదు.కరోనా కారణంగా సినిమాలన్నీ ఆగిపోయాయి.

ఈ ఏడాది చివర్లో పవన్‌, హరీష్‌ శంకర్‌ల మూవీ పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఇప్పట్లో ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Telugu Gabbarsingh, Harish Shankar, Pawanharish, Pawan Bday, Pawan Kalyan, Septe

సెప్టెంబర్‌ 2న పవన్‌ బర్త్‌డే సందర్బంగా ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు ఇచ్చే అవకాశం ఉందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు.ఈ స్క్రిప్ట్‌ వర్క్‌లో క్రిష్‌ హ్యాండ్‌ కూడా వేసినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రం టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.పవన్‌ బర్త్‌డే సందర్బంగా టైటిల్‌ను అనౌన్స్‌ చేసే విషయమై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వకీల్‌ సాబ్‌ టీజర్‌, క్రిష్‌ మూవీ మరియు హరీష్‌ శంకర్‌ మూవీకి సంబంధించిన విషయాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube