మరికొన్ని గంటల్లో వారికి ఉరి

నిర్భయ దోషులకు మరికొన్ని గంటల్లో ఉరి శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది.ఉరి శిక్షను తప్పించుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు అన్ని కూడా వృదా అయ్యాయి.

 Pawan Gupta Vinay Sharma Mukesh-TeluguStop.com

ఇటీవల సుప్రీం కోర్టులో కూడా ఉరి శిక్ష విషయమై వాదనలు సాగాయి.అయితే నిందితులు కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి పట్ల ఎలాంటి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు అంటూ ప్రభుత్వం తరపు లాయర్‌ కోర్టుకు సూచించడం జరిగింది.

దాంతో సుప్రీం కోర్టు ఉరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఉరిశిక్షను అమలు చేసేందుకు నిర్భయ నింధితులు ఉన్న తీహార్‌ జైలుకు తలారీ పవన్‌ జల్లాద్‌ చేరుకున్నాడు.

ఇప్పటికే అక్కడ ట్రయల్‌ రన్‌ సాగింది.మరికొన్ని గంటల్లోనే వారికి ఉరి శిక్షను అమలు చేసేందుకు పవన్‌ రెడీ అయ్యాడు.

ప్రస్తుతం పవన్‌ జల్లాద్‌ తీహార్‌ జైలోలనే ఉన్నాడు కనుక రేపు తెల్లవారు జామున లేదంటే ఫిబ్రవరి 1వ తారీకు తెల్లవారు జామున కూడా ఉరి శిక్ష వేసే అవకాశాలు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.వారి ఉరి కోసం జాతి మొత్తం ఎదురు చూస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube