నిర్భయ దోషులకి ఉరిశిక్ష తేదీ ఖరారు  

Nirbhaya Gangrape Convicts To Be Hanged On Feb 1-hanged On Feb 1,nirbhaya Gangrape Convicts

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.ఈ ఘటన తర్వాత ఆడవాళ్ళ మీద అత్యాచారాలు నిరోధానికి నిర్భయ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు.

Nirbhaya Gangrape Convicts To Be Hanged On Feb 1-Hanged 1

అయితే ఈ చట్టం మాత్రం దేశంలో పెరిగిపోతున్నా అత్యాచారాలు, హత్యలని నియంత్రించలేకపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారికి ఢిల్లీ కోర్టు ఇప్పటికే ఉరిశిక్ష ఖరారు చేసింది.

అయితే అందులో ముఖేష్ కుమార్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్ కారణంగా ఈ ఉరిశిక్ష వాయిదా పడింది.

ఇదిలా ఉంటే ఈ క్షమాభిక్ష పిటీషన్ ని రాష్ట్రపతి కొట్టేసిన నేపధ్యంలో మరోసారి వీళ్ళ ఉరిశిక్ష విషయం చర్చకి వచ్చింది.

పిటీషన్ రద్దు కావడంతో వీరి ఉరిశిక్షని ఖరారు చేస్తూ ఢిల్లీ కోర్టు తేదీ ఖరారు చేసింది.ఫిబ్రవరి 1వ తేదిన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్టు ఢిల్లీ కోర్టు తెలిపింది.

తీహార్ జైల్లోనే నలుగురు దోషులకు ఉరి ఉంటుందని కోర్టు తెలిపింది.ఇక వీళ్ళ ఉరిశిక్ష ఖరారు కావడంతో దేశ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక నిర్భయ తల్లి కూడా ఈ ఉరిశిక్షపై సంతోషం వ్యక్తం చేసింది.ఇక చనిపోయే ముందు దోషులకి తల్లిదండ్రులని చూసే అవకాశం ఢిల్లీ కోర్టు ఇచ్చినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు