రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ప‌వ‌న్ అభ‌యం.. !

రాజ‌కీయ నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.ఎన్నిక‌ల సీజ‌న్ ప్రారంభం కావ‌డంతో వీరికి ఉపాధి, పున‌రావాసం క‌ల్పించేందుకు రాష్ట్రంలో ఓ తాజా రాజ‌కీయ పార్టీ స‌ర్వ‌స‌న్నద్ధంగా ఉండ‌డంపై మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 Pawan Gives Life To Political Employers-TeluguStop.com

ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ పార్టీల్లోకి జంప్ చేసి.వాటిలో ఇమ‌డ లేక‌.

బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ఏపీలో చాలా మందే ఉన్నారు.వీరు మ‌ళ్లీ రాజ‌కీయంగా చ‌క్రం తిప్పాల‌ని భావించినా.

కూడా ఎవ‌రూ వీరికి అవ‌కాశం ఇవ్వ‌డం లేదు.దీంతో వీరు.

అప్పుడ‌ప్పుడు మీడియా ముందుకు రావ‌డం, ఏదో నాలుగు మాట‌లు అనేయ‌డంతోస‌రిపెడుతున్నారు.ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారిలో చాలా మంది ఖాళీగానే ఉన్నారు.

ఇక‌, వైసీపీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని ఆశించి.టీడీపీ నుంచి ఆ పార్టీ లో చేరి.తీరా వారి ఆశ‌లు నెర‌వేర‌క పోవ‌డం బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ‌కీయంగా నిరుద్యోగులుగా మారిన వారూ చాలా మందే ఉన్నారు.ఇప్పుడు వీరంతా కూడా త‌మ‌కు రాజ‌కీయంగా ఆద‌రువు ఇచ్చే వారికోసం ఎద‌రు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వీరికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రూపంలో మంచి మ‌ద్ద‌తు ల‌భించింది.ఆయ‌న స్థాపించిన జ‌న‌సేన పార్టీలో ఇప్పుడు నేత‌లు క‌రువ‌య్యారు.నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న పిలుస్తాడు వెళ్దాం అని చాలా మంది నాయ‌కులు ఎదురు చూశారు.అయితే, ఎవ‌రినీ ప‌వ‌న్‌పిల‌వ‌లేదు.

దీనికితోడు రానురాను ఆయ‌న క‌మ్యూనిస్టుల్లో క‌లిసిపోవాల‌ని భావిస్తుండ‌డం, వారి సిద్ధాంతాల‌నే త‌న‌విగా ప్ర‌చారం చేసుకోవ‌డం కూడా మైన‌స్‌గా మారింది.

దీంతో కీల‌క‌నేత‌లు ఎవ‌రూ జ‌న‌సేన వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు.

దీంతో ఇప్పుడు ఎటూ కాకుండా మిగిలిన రాజ‌కీయ నిరుద్యోగులు మాత్రమే జ‌న‌సేన వైపు అడుగులు వేస్తున్నారు.విశాఖలో ప్రజారాజ్యం మాజీ ప్రజా ప్రతినిధి చింతలపూడి వెంకటరామయ్య కు జనసేన ఆహ్వానం పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే మాజీ మంత్రి కొణతాల అనుయాయునిగా పేరు పడిన గండి బాబ్జీ తదితరులు కూడా జనసేన బాట పడుతున్నారని తెలుస్తోంది.ఈ లెక్కన చూస్తుంటే కొణతాల కూడా వస్తారేమో అన్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

దీనిని బ‌ట్టి.రాబోయే రోజుల్లో జ‌న‌సేన.

పార్టీ.రాజ‌కీయ నిరుద్యోగుల‌కు పెద్ద పున‌రావాస కేంద్రంగా మారిపోవ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లకు బ‌లం చేకూరుతోంది.

మొత్తానికి ప‌వ‌న్ క‌లలు కంటున్న మార్పు వీరితోనే సాకారం అవుతుందో ఏమో .చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube