ప‌వ‌న్ నీ తిక్క పాలిటిక్స్‌లో వ‌ద్దు

ఏపీకి హోదా ఇవ్వ‌ని టీడీపీ-బీజేపీల‌పై జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరుగుతున్నాడు.ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన ఆ పార్టీలు ఇప్పుడు ఎదురుదాడికి దిగాయి! అయితే ఎప్పుడో బ‌హిరంగ స‌భ‌ల్లోనో, ట్విటర్ లోనే వీటికి స‌మాధాన‌మిస్తున్నాడు! దీంతో ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలిపై బీజేపీతో పాటు విశ్లేష‌కులు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

 Pawan Foolishness In Politics-TeluguStop.com

సినిమాల్లో ఉన్న‌ట్లు తన‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే కుద‌ర‌ద‌ని, రాజ‌కీయాల‌కు సినిమాల‌కు తేడా ఉంద‌ని.సూచిస్తున్నారు!!

రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్‌.

దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు! బ‌హిరంగ స‌భ‌ల్లో ఆవేశంగా మాట్లాడుతున్నారు! సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.అయితే ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.రాజ‌కీయాల్లో ఎల్ల‌ప్పుడూ ఇటువంటి వ్య‌వ‌హార శైలి ఉండ‌కూడ‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.సోషల్‌ మీడియాలో స్పందిస్తే చాలు.

అదే రాజకీయం అనుకుంటున్నారేమో అని బీజేపీ నేత‌లు దుయ్య‌బడుతున్నారు!

‘ప్రత్యేక హోదా కోసం నువ్వు నడుం బిగిస్తే, నీ వెంట నడవడానికి సిద్ధం’ అని అప్పట్లో ఒకరిద్దరు టీడీపీ ఎంపీలు, పవన్‌కి సవాల్‌ విసిరారు.అప్పుడు పవన్‌ స్పందించలేదు! ఒక‌ప‌క్క 2017 మార్చి తర్వాత, దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఉండదని కేంద్రం చెబుతోంది.

మ‌రి ఈ స‌మ‌యంలో హోదా కోసం ప‌వ‌న్‌ పోరాటం చేస్తామంటున్నారు.కేంద్రం హోదా స్టేట‌స్ తీసేస్తే.

ఇప్పుడు ప‌వ‌న్ హోదా కోసం ఉద్య‌మించినా నిరుప‌యోగ‌మే! ఇదే ఉద్య‌మం 2014 ఎన్నికల తర్వాతే ప్రారంభించి ఉంటే ఎంతో కొంత ల‌బ్ధి చేకూరేద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!

‘నేను ట్విట్టర్‌లో అయినా స్పందిస్తున్నాను.మీరెందుకు పార్లమెంటులో ప్రశ్నించడంలేదు.’ అంటూ ఏపీ ఎంపీల్ని పవన్‌ ప్రశ్నించిన దరిమిలా, ఆయన సోషల్‌ మీడియా నుంచి బయటకొచ్చి, వాస్తవాలు గమనిస్తే మంచిదన్న భావన సహజంగానే తెరపైకి వస్తోంది! జ‌న‌సేన పార్టీలో పవన్‌కళ్యాణ్‌ తరఫున ఆ విమర్శల్ని తిప్పికొట్టేందుకూ జనసేన నేతలెవరూ కన్పించడంలేదు.తన మీద వచ్చే విమర్శలకు వపన్‌కళ్యాణే సమాధానం చెప్పాలి.

కానీ, ఆయనకు అంత తీరికెక్కడిది.? అసలు, రాజకీయాలపై ఆయనకు చిత్తశుద్ధి ఎక్కడిది.? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి! మ‌రి ఇప్ప‌టికైనా ప‌వ‌న్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తారేమో వేచి చూడాలి!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube