జగన్ యాత్రలో “పవన్ ఫ్లెక్సీ”..మాకు ఇద్దరూ కావాలి       2018-06-10   22:09:53  IST  Bhanu C

ఏపీలో రాజకీయం రంగు మారుతోంది..గత ఎన్నికల్లో టీడీపీ ,బీజేపి ,జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ ప్లేస్ ని బీజేపి రీప్లేస్ చేసి జగన్ ని చేర్చుకుంది..పవన్ కళ్యాణ్ సైతం జగన్ తో జట్టు కట్టడానికి సిద్దం అంటున్నాడు..అయితే ఈ వార్త ప్రస్తుతానికి అఫీషియల్ గా రాకపోయినా త్వరలోనే ఈ ప్రకటన అధికారికంగా తెలుస్తుందని అంటున్నారు..అయితే ఒక్క సారిగా అందరికీ తెలిసే కంటే కూడా తాము ప్రకటించేలోగా మెల్ల మెల్లగా ఆ వార్త అందరి నోళ్ళల్లో నానాలి అనుకున్న ఇరు పార్టీలు ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి అయితే

ఈ క్రమంలోనే జగన్ పాదయత్ర ఎంతో అంగరంగ వైభవంగా దూసుకు పోతూఉంటే మరో పక్క వ్యుహకర్తలు పవన్ జగన్ లు ఒకటే అనేట్టుగా అటు పవన్ ఫ్యాన్స్ లో ఇటు జగన్ అభిమానుల్లో ఒక ఆలోచన కలిగించే ప్రయత్నాలు ఇప్పటినుంచీ మొదలు పెట్టేశారు…ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది ఎంతో మంది కార్యకర్తలు ,అభిమానుల మధ్య ఎంతో కోలాహలంగా సాగుతున్న ఈ పాదయాత్ర లో ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది..

జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.. ఈ ఫ్లెక్సీలు లు చూసిన వాళ్ళు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు..మీడియా కి రెండు రోజులకి సరపడా మంచి న్యూస్ కూడా దొరికిందని సంబరపడింది…ఈ ఫ్లెక్సీలు మార్కండేయపురంలో ఏర్పాటు చేశారు.. జగన్, పవన్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను జగన్ అభిమానులు ఏర్పాటు చేశారు. అటు చంద్రవరంలో బాలకృష్ణ, జగన్, వీరిద్దరి మధ్యలో మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అయితే జగన్ పవన్ కలిసి ఉన్న ఫ్లెక్సీలలో అభిమానులు ఒక ఆసక్తికరమైన కొటేషన్ పెట్టారు అదేంటంటే . ‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’….అంటూ ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి…అయితే ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి… పవన్ జగన్ త్వరలో కలవబోతున్నారు అనడానికి ఈ ఫ్లెక్సీలు నిదర్సనమని టీడీపీ నేతలు అప్పుడే కామెంట్స్ కూడా చేస్తున్నారు..అయితే ఇది వ్యూహాత్మకంగా జరిగిందా లేక అభిమానులు ఏర్పాటి చేసుకున్న ఫ్లేక్సీలా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.