పవన్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఫ్యామిలీ పిల్లలు ఎక్కడ?- Pawan Fans Tension About His Health And His Family

pawan fans tension about his health and his family ,latest news,viral - Telugu Corona For Pawan, Hari Hara Veeramallu, Pawan Covid 19, Pawan Kalyan, Pawan Vakeel Saab

పవన్ కళ్యాణ్‌ వకీల్ సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్ సందర్బంగా కరోనా బారిన పడ్డట్లుగా నిర్థారణ అయ్యింది.ఇటీవల కాలంలో ఆయన బయటి కార్యక్రమాలకు ఎక్కువ వెళ్లలేదు అలాగే వకీల్‌ సాబ్ ప్రీ రిలీజ్ లో పాల్గొన్న బండ్ల గణేష్‌ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

 Pawan Fans Tension About His Health And His Family-TeluguStop.com

ఇవన్నీ కారణాల వల్ల పవన్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్బంగానే కరోనా అంటి ఉంటుందని అభిమానులు ఒక అంచనాకు వస్తున్నారు.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పవన్‌ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు.

ఆయన ఏం చేస్తున్నాడు.ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నారు.

 Pawan Fans Tension About His Health And His Family-పవన్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఫ్యామిలీ పిల్లలు ఎక్కడ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన భార్య అన్నా లెజ్నోవా సురక్షితంగా ఉన్నారా అంటూ రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఆ ప్రశ్నలన్నింటికి పవన్‌ సన్నిహితుల ద్వారా సమాచారం వచ్చింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ ప్రస్తుతం తన ఫామ్‌ హౌస్‌ లో ఉన్నారు.గత వారం పది రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు.కరోనా భయంతో ఆయన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.అన్నా లెజ్నోవా సిటీలో ఉండగా పవన్ మాత్రం ఫామ్ హౌస్ లో కరోనా కారణంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు.

పిల్లలు మరియు అన్నా లెజ్నొవా అంతా కూడా కరోనా నెగటివ్‌ అంటూ మెగా సన్నిహితులు చెబుతున్నారు.పవన్‌ కు కరోనా అనుమానం వచ్చినప్పటి నుండి పూర్తిగా జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నాడు.

కనుక ఈ విషయంలో ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదు.ఊపిరి తిత్తుల్లో నిమ్ము ఉండి శ్వాస తీసుకోవడంకు కాస్త ఇబ్బంది పడ్డ పవన్‌ కళ్యాణ్‌ చికిత్స తర్వాత మళ్లీ క్యూర్‌ అవుతున్నారు.

వారం పది రోజుల్లో పవన్‌ నెగటివ్‌ లోకి వచ్చేస్తారంటూ వైధ్యులు నమ్మకంగా చెబుతున్నారు.పవన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం వాకబు చేస్తోంది.

అపోలో ఆసుపత్రి వైధ్యుల బృందంతో పాటు పవన్ వ్యక్తిగత వైధ్యుడు కూడా ఆయన వెంటే ఉన్నారు.

#Pawan Kalyan #Pawan Covid 19 #HariHara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు