పవన్ ఫ్యాన్స్‌ అలర్ట్‌: 'వకీల్ సాబ్‌' అప్ డేట్ వచ్చేస్తోంది

పవన్‌ కళ్యాణ్ అభిమానులు వకీల్‌ సాబ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పవన్‌ సినిమా వచ్చి మూడున్నర ఏళ్లు అయ్యింది.

 Pawan Fans Alert Vakil Saab Update Is Coming-TeluguStop.com

కనుక ఖచ్చితంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మించాడు.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీ పింక్‌ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.మెసేజ్ ను మాత్రం చెడగొట్టకుండా సినిమాను సింపుల్ గా కాస్త కమర్షియల్‌ టచ్ ఇచ్చి రూపొందించినట్లుగా చెబుతున్నారు.

 Pawan Fans Alert Vakil Saab Update Is Coming-పవన్ ఫ్యాన్స్‌ అలర్ట్‌: వకీల్ సాబ్‌’ అప్ డేట్ వచ్చేస్తోంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా నుండి ఇప్పటికే మగువ మగువ అనే పాట వచ్చేసింది.ఇప్పుడు సినిమా నుండి మరో పాట వచ్చేందుకు రెడీ అయ్యింది.

పాట ఎప్పుడు రాబోతుంది అనే విషయాన్ని కూడా ప్రకటించేందుకు సిద్దం అయ్యారు.

శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా లో కీలక పాత్రలో అంజలి మరియు నివేథా థామస్ లు నటించారు.

పవన్‌ కళ్యాణ్‌ వకీల్ సాబ్ లుక్ కు ఇప్పటికే అభిమానులు ఫిదా అవుతున్నారు.లాయర్‌ గా పవన్‌ ను మరో రేంజ్‌ లో చూపించ బోతున్నారు.ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ముగించుకుని వచ్చే నెల 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు వెయిట్‌ చేస్తోంది.భారీ వసూళ్లను సాధిస్తుందని భావిస్తున్న ఈ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మెల్ల మెల్లగా సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.

ఇప్పటికే విడుదల అయిన పాట క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా ఈ సినిమా నుండి రాబోతున్న రెండవ పాట ఖచ్చితంగా మాస్‌ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. థమన్‌ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.

#Pawan Kalyan #The Pink Remak #Vakkel Sb #Sruthihasan #VakeelSab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు