అడిగిన వారందరికి ఓకే చెప్తున్న పవన్‌.. ఇవన్నీ చేసేవేనా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.ఆ సినిమా విడుదల తేదీ వచ్చేసింది.

 Pawan Doing Back To Back Movie Fans Full Happy , Pawan Back To Back Movies, Pawa-TeluguStop.com

ఇక మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ లో కూడా పవన్ నటిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే సగానికి పైగా ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది.

ఆ సినిమా షూటింగ్‌ మద్యలో ఆపి క్రిష్‌ దర్శకత్వంలో సినిమాను పవన్ మొదలు పెట్టాడు.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా దర్శకుడు హరీష్‌ శంకర్‌ మరియు సురేందర్‌ రెడ్డిల కాంబోలో సినిమా లు కూడా చేసేందుకు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లు కూడా సమ్మర్‌ లోనే ప్రారంభం అవుతాయని అంటున్నారు.ఈ సినిమాలు మాత్రమే కాకుండా బండ్ల గణేష్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తాడని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలు అయ్యే విషయమై క్లారిటీ లేదు.ఇలాంటి సమయంలో మరిన్ని సినిమాలకు కూడా పవన్‌ ఓకే చెప్తున్నాడు అంటున్నారు.

టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తనకు ఆప్తుడు అయిన అలీ నిర్మాణంలో కూడా ఒక సినిమాను చేసేందుకు పవన్‌ ఓకే చెప్పాడని అంటున్నారు.ఇలా తనకు సన్నిహితులు అనుకున్న వారికి గతంలో అడ్వాన్స్ తీసుకున్న వారికి సినిమాలు చేసి పెడుతున్నారు.

ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ లో వరుసగా సినిమాలు కమిట్‌ అవ్వడంతో పాటు వారికి డేట్లు కూడా ఇస్తున్న పవన్‌ అందరి అభిమానంను దక్కించుకుంటున్నాడు.ఆయన వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతున్న కారణంగా అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

పెద్ద ఎత్తున పవన్‌ సినిమాలు ఈ ఏడాది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈయన నటించిన దాదాపు ఏడు ఎనిమిది సినిమాలు రెండేళ్ల గ్యాప్‌ లో వస్తాయని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube