కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటూ పవన్ డిమాండ్..!!

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పాత షెడ్యూలు ప్రకారం ఎవరైతే నామినేషన్ వేశారో దాన్ని కంటిన్యూ చేసే రీతిలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.గతంలో కరోనా వైరస్ రాకముందు ఏపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ అయిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం అప్పట్లో చాలామంది నామినేషన్ వేయడం జరిగింది.

 Pawan Demands Release Of New Notification Pawan Kalyan, Corona Virus Election No-TeluguStop.com

సరిగ్గా నామినేషన్ల ఉపసంహరణ తేదీ  టయానికి మహమ్మారి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది.అయితే ఇటీవల ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుండి కంటిన్యూ చేయాలని తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.మేటర్ లోకి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 మునిసిపాలిటీలు 12 కార్పొరేషన్ల ఎన్నికలకు నూతనంగా షెడ్యూల్ ఇవ్వాలని పవన్ కోరారు.

గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారం కంటిన్యూ చేయాలని కోరడం సరైంది కాదని పేర్కొన్నారు.ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు బలవంతంగా నామినేషన్లను వెనక్కి తీసుకున్నారని, మరికొందరు మహమ్మారి వల్ల మృతి చెందారని, ఇప్పుడు ఈ స్థానాలను ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని, సో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పవన్ పేర్కొన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube