తిరుపతిలో “చంద్రబాబు దీక్ష” కి కౌంటర్ సిద్దం చేసిన “పవన్”

ఎపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు ,తన పార్టీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,కారకర్తలు అందరూ కలిసి నిరసనలు చేపడుతున్న విషయం అందరికే తెలిసిందే అయితే మొన్న విజయవాడలో చంద్రబాబు చేసిన ఒకరోజు దీక్ష కోసం ముందు నుంచీ ఎంతో ప్లాన్డ్ గా వెళ్ళిన చంద్రబాబు కి మోకాలు అడ్డుపెట్టాడు పవన్ కళ్యాణ్…పవన్ గనుకా ఆ సమయంలో మీడియా దృష్టిని ఆకర్షించకుండా ఉండి ఉంటే ఆ దీక్ష ఎఫెక్ట్ ఢిల్లీ ని మరింత బలంగా తాకేది అయితే కానీ కావాలనే పవన్ మీడియా దృష్టి మరల్చాడు అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడే కామెంట్స్ చేశారు.

 Pawan Counter To Chandrababu Strike-TeluguStop.com

ఇదిలాఉంటే చంద్రబాబు తిరుపతిలో చేపట్టబోయే మరో దీక్షని సైతం పవన్ కళ్యాణ్ అడ్డుపడనున్నారట.చంద్రబాబు బాబు దీక్షకి మైలేజ్ రాకుండా చేయడానికే పవన్ ఈ సేక్చ్ వేశాడని అంటున్నారు టీడీపి నేతలు.బాబు సభ విజయవంతం కాకుండా పవన్‌ రోడ్‌షోలు నిర్వహించి జనసేన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేస్తున్నారట.అంతేకాదు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు లో తెలుగుదేశం పార్టీ మైలేజ్ ని తగ్గించాలనే టార్గెట్ జగన్ ,పవన్ పెట్టుకున్నారట.

అందులో భాగంగానే ఈ పవన్ పాదయాత్ర చేపడుతూనే వైసీపి నేతలతో ,జనసేన పార్టీ నేతలతో సమావేశాలు పెట్టనున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా వైఎస్సార్సీ,జనసేన పార్టీల పొత్తుపై జనపార్టీలో కీలక నేతలు వైసీపీకి ముఖ్యనేత, గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖనేత సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది.

అయితే ఎన్నికల వరకూ కూడా పవన్ కళ్యాణ్ చంద్ర్రబాబు పర్యటించే ప్రాంతాలలోనే పోటీగా పర్యటించి చంద్రబాబు పర్యటనలకి విలువ లేకుండా చేద్దామనేది ప్లాన్ గా తెలుస్తోంది వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 30న విశాఖపట్నంలో టిడిపిపై వంచన దినంగా పాటిం చడం, తిరుపతిలో జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ పర్య టనతో వైఎస్సార్సీ,జనసేలు దగ్గరవుతున్నట్లు స్పష్టం అవుతుంది.

పవన్‌ కల్యాణ్‌ చిత్తూరు జిల్లా రోడ్‌షోలో గత ఎన్నికల్లో బాబు తన జిల్లాకి ఇచ్చిన కీలక హామీలని గురించి ప్రస్తావిస్తూ ప్రజల ముందు చంద్రబాబు ని ఇరికించడమే ఉద్దేశ్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ విషయాలపై పవన్ ఒక అవగాహనకి కూడా వచ్చారట.అలాగే మాజీ ముఖ్య మంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడిని ఒకానొక సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో అలోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలనే డిమాండ్ కూడా పవన్ చంద్రబాబు ని నిలదీయనున్నారు అని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube