జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికలపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది.ఇప్పటివరకు ఈ విషయంలో ఊగిసలాట ధోరణిలో ఉన్న జనసేన దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతుండడంతో… తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించేశారు పవన్.
గత కొద్ధి రోజుల క్రితం … తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రకటించారు.కానీ, వెంటనే ప్రకటన చేయలేదు.కాగా… ఇవాళ తెలంగాణలో పోటీపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగితే ఎక్కడి నుంచి పోటీచేయాలన్నదానిపై ఓ ప్రణాళిక రూపొందించుకున్నాం… కానీ, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టంగా భావించామని పేర్కొన్నారు పవన్.అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేయాలని తెలంగాణ జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పవన్ వెల్లడించారు.