క్లారిటీ ఇచ్చారు : ఓహో తెలంగాణ ఎన్నికలపై పవన్ అలా అనుకున్నారా ..?

జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికలపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది.ఇప్పటివరకు ఈ విషయంలో ఊగిసలాట ధోరణిలో ఉన్న జనసేన దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతుండడంతో… తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించేశారు పవన్.

 Pawan Clarity Given To The Contest In Telangana Elections-TeluguStop.com

గత కొద్ధి రోజుల క్రితం … తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రకటించారు.కానీ, వెంటనే ప్రకటన చేయలేదు.కాగా… ఇవాళ తెలంగాణలో పోటీపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.

షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగితే ఎక్కడి నుంచి పోటీచేయాలన్నదానిపై ఓ ప్రణాళిక రూపొందించుకున్నాం… కానీ, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కష్టంగా భావించామని పేర్కొన్నారు పవన్.అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలని తెలంగాణ జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పవన్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube