పాలకొల్లు పై పవన్ యూటర్న్..ఎందుకంటే..!!!  

Pawan Changed His Decision On Palakollu-elections 2019,janasena Party,palakollu,pawan Kalyan,telugu Political News Updates

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యవంతుడిగా, సినిమాలలో చూపించే తెగువు కంటే కూడా బయట ఇంకా ధైర్యంగా ఉంటాడని పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గాజువాక నుంచీ పోటీ చేస్తారనే టాక్ వచ్చిందే పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన అభిమానులు షాక్ తిన్నారు. అన్న ఓడిపోయిన స్థానాన్ని గెలుచుకోవడం కోసం జనసేనాని పట్టుమీద ఉన్నాడని..

పాలకొల్లు పై పవన్ యూటర్న్..ఎందుకంటే..!!!-Pawan Changed His Decision On Palakollu

ఎలాగైనా తన అన్న ఓడిన చోటనే గెలుపు సాధించుకుంటాడని ముందు నుంచీ భావించారు. కానీ ఒక్క సారిగా పవన్ అసలు పశ్చిమ లోనే పోటీ చేయకపోవడం అభిమానులని కూడా నిరాశకి గురిచేస్తోంది. అసలు పవన్ ఎందుకు ఇలా యూటర్న్ తీసుకున్నాడు, ఎందుకు పాలకొల్లు ని ఎంచుకోలేదు.

అనే వివరాలలోకి వెళ్తే.

పశ్చిమ గోదావరిలో డెల్టా ప్రాంతం అయిన పాలకొల్లు నియోజకవర్గంలో గతంలో చిరంజీవి పోటీ చేసి ఓడిపోయిన విషయం విధితమే. అందుకు కారణాలు లేకపోలేదు..

అప్పట్లో కేవలం రాజకీయలకోసమే తమ ముఖం చూశాడని, అసలు సొంత ఊరుకి ఎన్ని సార్లు చిరజీవి వచ్చారని,ఇక్కడి సమస్యల్ని చిరంజీవి వద్దకి తీసుకువెళ్ళినా కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని స్థానికులు అప్పట్లో చిరంజీవిపై పూర్తి వ్యతిరేకత చూపించారు. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కొత్త పార్టీ అయిన ప్రజారాజ్యం కి దెబ్బకొట్టింది. వైఎస్ ని కాదని చిరుకి ఓటు వేయలేక పోయారు పాలకొల్లు ప్రజలు.

అయితే అదే స్థానం నుంచీ పోటీ చేసి గెలుపొందాలని ముందు నుంచీ భావించిన పవన్ కళ్యాణ్ ఒక్క సారిగా డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే

ఇప్పుడు పాలకొల్లులో టీడీపీ నుంచీ నిమ్మల రామానాయుడు బరిలో ఉన్నారు. అదే సమయంలో వైసీపీ నుంచీ డాక్టర్ బాబ్జీ కూడా బరిలో ఉండటంతో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ భారీ స్థాయిలోనే ఉండబోతోంది. నిమ్మల రామానాయుడి కంటే కూడా డాక్టర్ బాబ్జీ కి పూర్తిస్థాయిలో ప్రజా మద్దతు ఉండటంతో దాదాపు పాలకొల్లు సీటు వైసీపీదే అని ఫిక్స్ అయిపోయారు స్థానిక ప్రజలు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గనుకా ఆ స్థానం నుంచీ బరిలోకి దిగితే సొంత ఊరిలో అన్నకి ఎదురయిన ఘోరమైన అవమానం మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుందోనని భయపడి ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది..

ఇదిలాఉంటే నిమ్మల ఇమేజ్ కి, బాబ్జీ ప్రజాదరణ ముందు పవన్ కళ్యాణ్ కొట్టుకుపోవడం ఖాయం అంటూ స్థానిక జనసేన నేతలు సైతం చెప్పడంతో పవన్ యూటర్న్ తీసుకున్నారని టాక్ విన్పిస్తోంది. ఏది ఏమైనా తెలుగుదేశం గెలుస్తోందని భావించే స్థానాలలో పవన్ డమ్మీ అభ్యర్ధులని నిలబెట్టడం, పవన్ కి పట్టున్న స్థానాలలో టీడీపీ డమ్మీలని నిలబెట్టడంతో పవన్ మళ్ళీ చంద్రబాబు చెంతకే చేరుతున్నాడని అర్థమవుతోంది అంటున్నారు విశ్లేషకులు. మరి పవన్ ని ఏపీ ప్రజలు నమ్ముతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.