ప్లేట్ ఫిరాయించిన ప‌వ‌న్‌... భ‌లే బుక్ అయ్యాడే...!

అంత‌న్నాడింత‌న్నాడే.అన్న చందంగా ఉంది.జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం అంటున్నారు ప‌రిశీల‌కులు.రాజ‌ధాని విష యంలో తాజాగా ప‌వ‌న్ చేసిన కామెంట్లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేశాయి. రాజ‌ధాని త‌ర‌లింపు స‌హా మూడు రాజ‌ధానుల‌పై వైసీపీ స‌ర్కారు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేద‌న్న ప‌వ‌న్‌.ఒక‌వేళ అలాంటి ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు.

 Pawan Change Plan...netigens Troll,janasena,pawan Kalyan,power Star,janasainiks,-TeluguStop.com

తాను రంగం లోకి దిగుతాన‌ని చెప్పారు.అంతేకాదు.

ఏ ఏడాదో.ప‌దిరోజులో టార్గెట్‌గా పెట్టుకుని ఉద్య‌మాలు చేయ‌డం స‌రికాద‌న్నారు.

అంతేకాదు.ఉద్య‌మాన్ని మ‌హిళ‌లు మ‌రింతగా ముందుకు తీసుకువెళ్లాల‌ని సూచించారు.

అయితే.ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.ఏదైనా ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ప్పుడు నేనున్నానే నాయ‌కుడిగా ప‌వ‌న్ పేరు తెచ్చు కున్నారు.గ‌తంలో ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆయ‌న గ‌ళం వినిపించారు.

పాచిపోయిన ల‌డ్డూలు అంటూ. ప్యాకేజీని ఆయ‌న అభివ‌ర్ణించారు.

అయితే.అప్ప‌ట్లో కేంద్రం మేం హోదా ఇవ్వ‌లేం.

అని అధికారికంగా ప్ర‌క‌టించ‌కుండానే ప‌వ‌న్ రాష్ట్రంలో ఉద్య‌మిస్తా న‌ని ప్ర‌క‌టించారు.ఆ త‌ర్వాత కొన్నాళ్లకు ఆయ‌న దానిని వ‌దిలేశారు.

కార‌ణాలు ఏవైనా కానీ.హోదా ఉద్య‌మాన్ని ప‌క్క‌న పెట్టి.

హోదా ఇచ్చేది లేద‌న్న బీజేపీతోనే చెట్టాప‌ట్టాలేసుకుని ముందుకు సాగుతున్నారు.

Telugu Janasainiks, Janasena, Janasenani, Pawan Kalyan, Womens Role-Political

పైగా ప్ర‌త్యేక హోదా కోసం ఎవ‌రూ క‌లిసి రావ‌డం లేదు.ఏపీ ప్ర‌జ‌ల‌కు పౌరుషం లేదు.అందుకు హోదా ఉద్య‌మం ముందుకు సాగ‌డం లేద‌ని చెప్పారు.

క‌ట్ చేస్తే.ఇప్పుడు రాజ‌ధాని ఉద్య‌మం దాదాపు ఏడాది కాలంగా తారాజువ్వ స్థాయిలో ఎగిసిప‌డు తోంది.

తానే స్వ‌యంగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.అంతేకాదు.

క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చి తాట‌తీస్తా.అంటూ డైలాగులు పేల్చాడు.మ‌రి.ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించ‌న‌ప్పుడు.ప‌వ‌న్ ఎందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్టు.ప్ర‌క‌ట‌న‌లు చేసిన‌ట్టు అనే ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఇప్ప‌టికీ స‌మాధానం లేదు.

పైగా మ‌హిళ‌లే ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లాలి! అనే పిలుపులో తాను చేతులు ఎత్తేశాన‌నే అర్ధం ధ్వ‌నిస్తోంద‌ని అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు.మొత్తానికి రాక రాక వ‌చ్చినా.

చేయ‌క చేయ‌క కామెంట్లు చేసినా.ప‌వ‌న్ అడ్డంగా బుక్క‌య్యార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube