పవన్‌ 15 సినిమాల వెనక అసలు కథ ఇదేనట

పవన్‌ కళ్యాణ్‌ చాలా ఏళ్ల క్రితం ఒక నిర్మాణ సంస్థను స్థాపించాడు.పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ అంటూ ఉండే ఆ బ్యానర్‌ లో అప్పుడప్పుడు సినిమాలు వస్తున్నాయి.

 Pawan Kalyan And People Media Factory Banner Jointly Produce 15 Movies , Pawan K-TeluguStop.com

చిన్నా చితకా సినిమాలను విడుదల చేస్తున్నారు.ఆ సినిమా ల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు.

అయినా కూడా పవన్‌ బ్రాండ్‌ వల్ల సినిమాలకు మంచి పేరు అయితే వచ్చింది.ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అనేది ఒక పేరు కాదు బ్రాండ్‌ అనే విషయం తెల్సిందే.

అందుకే పవన్ కళ్యాణ్‌ ను సాధ్యం అయినంతగా వాడుకునేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.నిర్మాతగా పవన్‌ పేరు వేస్తే ఖచ్చితంగా సినిమా రేంజ్ పెరుగుతుంది.

అందుకే ఇప్పటి వరకు పవన్‌ నిర్మాణంలో వచ్చిన సినిమాలకు పెట్టుబడి ఏమీ పెట్టలేదు.కేవలం ఆయన పేరు పెట్టబడిగా ఇతర నిర్మాతలు పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించారు.

ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడా పవన్‌ తో ఆ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల వరుసగా సినిమాలు నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఏకంగా 15 సినిమాలను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

అందులో భాగంగా 6 లో బడ్జెట్‌ చిత్రాలు, 6 మీడియం రేంజ్‌ సినిమాలు, 3 భారీ బడ్జెట్‌ సినిమాలను నిర్మించేందుకు గాను పీపుల్ మీడియా సిద్దం అయ్యింది.ఈ మొత్తం సినిమాలకు పీపుల్‌ మీడియా వారు దాదాపుగా 150 కోట్ల రూపాయలు పెట్టబోతున్నారట.

పవన్‌ కళ్యాణ్‌ ఒక్క రూపాయి కూడా లేకుండానే ఈ సినిమాలన్నింటికి నిర్మాతగా మారబోతున్నాడు.అందుకు గాను పవన్ కు భారీ మొత్తంలో అమౌంట్ ముట్టబోతుంది.ముందస్తుగా ఇచ్చిన మొత్తం మాత్రమే కాకుండా సినిమాలు విడుదల అయ్యి విజయం సాధిస్తే లాభాల్లో వాటాను కూడా పవన్ కు ఇస్తారు.ఈ మొత్తం సినిమాల్లో కొన్ని సక్సెస్‌ అయినా కూడా పవన్‌ కు మొత్తంగా వంద కోట్లకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

పవన్ కళ్యాణ్‌ రూపాయ పెట్టకుండానే వంద కోట్లకు పైగా ఆదాయం రావడం అనేది ఆయన బ్రాండ్ వ్యాల్యూను తెలియజేస్తుంది.ఈ మొత్తం సినిమాల కథలను ఎవరు పర్యవేక్షిస్తారు అనేది ఆసక్తిగా మారింది.

ఈ బడా డీల్ లోకి త్రివిక్రమ్‌ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube