పవన్, మహేష్ మల్టీస్టారర్ మూవీ.. శుభాకాంక్షలు చెప్పిన నమ్రత!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ హవా నడుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ కూడా ఎక్కువగా పాన్ ఇండియాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

 Pawan And Mahesh-multistarrer Movie Namratawish Them Pawan Kalyan, Mahesh Babu,-TeluguStop.com

అదేవిధంగా పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి సైతం సిద్ధపడుతున్నారు.టాలీవుడ్ ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌.

ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే అభిమానులు మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

అదెవ‌రిదో కాదు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుల‌ది.

అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.మ‌హేష్ బాబు బ‌య‌ట ఎక్క‌డా ఎక్కువ‌గా క‌లుసుకోరు కానీ, ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది.

ఇది ఇలా ఉంటే క్రిస్మ‌స్ పండుగ కి మ‌హేష్‌కి  ప‌వ‌న్ ఆయ‌న స‌తీమ‌ణి అన్నాలెజినోవా బ‌హుమ‌తులు పంపారు.ఇదే విష‌యాన్ని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.

సోషల్ మీడియా వేదికగా ప‌వ‌న్ దంప‌తులకు అభినంద‌న‌లు తెలిపింది. న‌మ్ర‌త షేర్ చేసిన ఆ ట్వీట్ ని చూసి ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అటు మ‌హేష్ బాబు ఫ్యాన్స్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu Heroes, Mahesh Babu, Multirer, Pawan Kalyan, Tollywood-Movie

ఈ క్రమంలోనే ప‌లువురు నెటిజ‌న్స్ త‌మ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.ప‌వ‌న్ – మ‌హేష్ క‌లిసి మ‌ల్టీస్టారర్ మూవీలో న‌టించాల‌ని కోరడంతో ఆ విషయం పై స్పందించిన న‌మ్ర‌త‌ సాధ్య‌మ‌య్యేలా చూడాల‌ని కూడా ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో కోర‌డం విశేషం.ప‌వ‌న్ – మ‌హేష్ క‌లిసి సినిమా చేస్తే, వ‌చ్చే బాక్సాఫీస్ రీసౌండ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.వారిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే పవన్ అభిమానులకు, మహేష్ అభిమానులకు పండగే పండగ అని చెప్పవచ్చు.

ఇరువురి ఫ్యాన్స్ ఈ మల్టీస్టారర్ ల సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మ‌రి ఫ్యాన్స్ కోరిక‌ను న‌మ్ర‌త శిరోద్క‌ర్ ప‌ట్టించుకుని వారి మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌డానికి ముంద‌డుగు వేస్తారా?లేదా? అన్నది తెలియాలి అంటే వేచిచూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube