అఫిషియల్‌ః పవన్‌, క్రిష్‌ల సినిమా ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ రిలీజ్ అయ్యే తేదీ కన్ఫర్మ్‌

పవన్‌ కళ్యాణ్ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ మూవీ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

 Pawan And Krish Movie First Look And Title Revile Date-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వడమే ఆలస్యం వెంటనే టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్ ను రివీల్‌ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.చిత్ర యూనిట్‌ సభ్యులు పవన్‌ క్రిష్‌ ల మూవీ ఫస్ట్‌ లుక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న పవన్‌ 27 సినిమా ఫస్ట్‌ లుక్‌ ను మార్చి 11వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

 Pawan And Krish Movie First Look And Title Revile Date-అఫిషియల్‌ః పవన్‌, క్రిష్‌ల సినిమా ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ రిలీజ్ అయ్యే తేదీ కన్ఫర్మ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా లో హీరోయిన్‌ ఎవరు అనే విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.

అయినా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన షూటింగ్ ను మొఘలాయిల కాలం నాటి ఛార్మినార్‌ సెట్టింగ్‌ వద్ద జరుపుతున్నారు.

సినిమా కు చాలా కీలకం అయిన ఈ సెట్టింగ్‌ లో పవన్ కళ్యాణ్‌ ఉన్న ఫొటో ను ఫస్ట్‌ లుక్ గా విడుదల చేయబోతున్నారు.సినిమాకు ఛార్మినార్‌ కు చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది.

అందుకే ఫస్ట్‌ లుక్ లోనే బ్యాక్‌ డ్రాప్ లో ఛార్మినార్‌ సెట్టింగ్‌ కనిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ క్రిష్ ల కాంబో మూవీ ఫస్ట్‌ లుక్‌ వస్తున్న నేపథ్యంలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అదే రోజున టైటిల్‌ ను అనౌన్స్ చేయడంతో పాటు సినిమా విడుదల తేదీ విషయమై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

#First Look #Moghalai #Reveal Date #PawanAnd #Krish New Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు