రీమేక్‌లను మెగా హీరోలు రిపేర్‌ చేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా?  

pawan and chiranjeevi doing remakes with different style Pawan Kalyan, Chiarnjeevi, Mohan Lal, Lucifar, Pink, Vedhalam, Sruthi Hasan, - Telugu Chiranjeevi, Loosifar, Pawan Kalyan, Vakeel Saab, Vedalam

ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ కావడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా హిందీ తమిళం ఇతర భాషల్లో రీమేక్ అవుతూనే ఉన్నాయి.

TeluguStop.com - Pawan And Chiranjeevi Doing Remakes With Different Style

ఇతర భాషల సినిమాలు మరో భాషల్లో రీమేక్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా జరుగుతూనే ఉంది.అయితే రీమేక్ అనేది ఉన్నది ఉన్నట్లుగా చేస్తే ఎక్కువ శాతం మంచి ఫలితం వస్తుందని ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను చూస్తే నిరూపితమైంది.

రీమేక్ లో రిపేర్లు చేస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించడం కష్టమే అంటూ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి.ఇప్పుడు ఈ విషయం ఎందుకు అనుకుంటున్నారా మెగా హీరోలు పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి ఇద్దరు కూడా రీమేక్‌ సినిమాలు చేస్తున్నారు.

TeluguStop.com - రీమేక్‌లను మెగా హీరోలు రిపేర్‌ చేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

పవన్ కళ్యాణ్ పింక్ సినిమాను రీమేక్ ని చేస్తుండగా చిరంజీవి తమిళం వేదాళం మరియు మలయాళం లూసిఫర్ సినిమాలను రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు.పింక్ సినిమాలో హీరో కు జోడీగా హీరోయిన్ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ కోసం శృతి హాసన్ ని నటింపజేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తున్న నేపథ్యంలో పింక్ సినిమాను మార్చినట్లు తెలుస్తోంది.

ఇక లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ కు జోడిగా హీరోయిన్ ఎవరు ఉండరు కానీ చిరంజీవి చేయబోతున్న లూసిఫర్ రీమేక్ లో మాత్రం హీరోయిన్ ఉండడంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

స్క్రిప్టు విషయంలో ప్రముఖ రచయితలు చర్చల్లో పాల్గొంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఒరిజినల్ సినిమాలకు రిపేర్లు చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా లేదా అనేది అనుమానంగా ఉంది.

#Pawan Kalyan #Vakeel Saab #Vedalam #Loosifar #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pawan And Chiranjeevi Doing Remakes With Different Style Related Telugu News,Photos/Pics,Images..