పవన్ కళ్యాణ్ అన్నలాంటి వాడంటా  

Pawan And Ajith Are Elder Brothers For This Villain -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతపెద్ద స్టార్ అయినా, సెట్ లో అందరితో సాదాసీదాగా ఉండే మనస్తత్వం తనది.ఎవరితో పెద్దగా మాట్లాడకపోవచ్చు కాని, మాట్లాడినంతవరకు చాలు, పవన్ మాటల్లోనే తనది ఎంత మంచి వ్యక్తిత్వమో తెలిసిపోతుంది అని చెబుతూవుంటారు పవన్ సన్నిహితులు.

ఇప్పుడు అదే మాట చెబుతున్నాడు సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ కబీర్ దుహన్ సింగ్.జిల్ చిత్రంతో పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో బిజీ విలన్ అయిపోయాడు.తమిళంలో అజిత్ “వేదాలం” లో నటించిన కబీర్ పవన్ కళ్యాణ్, అజిత్ లవి ఒకేరకమైన మనస్తత్వాలు అంటున్నాడు.

Pawan And Ajith Are Elder Brothers For This Villain--Telugu Tollywood Photo Image

” పవన్ గారితో, అజిత్ గారితో పని చేయడం అనేది చాలా విలువైన అనుభవం.నేను వాళ్ళిద్దరిని పెద్దన్నల్లా చూస్తాను.ఇద్దరు అంత పెద్ద స్టార్స్ అయ్యుండి కూడా కేవలం సహనటులతో మాత్రమే కాదు … సెట్లో అందరితోను స్నేహపూర్వకంగా ఉంటారు.ఇద్దరి మనస్తత్వాలు చాలా దగ్గరగా ఉంటాయి ” అంటూ చెప్పుకొచ్చాడు కబీర్.

ఫ్యాన్ ఫాలోయింగ్ లో కాని, వ్యక్తిత్వంలో కాని పవన్ , అజిత్ ఒకేరకంగా అనిపిస్తారని ఇప్పటికే చాలామంది చెప్పారు.

ఇప్పుడు ఆ లిస్టులో కబీర్ కూడా వచ్చి చేరాడు.సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ తో పోటాపోటిగా నటిస్తున్న కబీర్ ఆ సినిమా విడుదలై హిట్ కొడితే ఇంకెంత బిజీగా అయిపోతాడో చూడాలి.

తాజా వార్తలు