నా భర్త అలాంటి వ్యక్తి.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన పవిత్ర లోకేశ్!

తెలుగులో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటీమణుల్లో పవిత్ర లోకేశ్ ఒకరనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

 Pavitra Lokesh Shocking Comments About Her Husband Goes Viral Deails, Pavitra Lokesh, Pavitra Lokesh Husband, Actress Pavitra Lokesh, Suchendra Prasad , Senior Naresh, Pavitra Lokesh Naresh Marriage,-TeluguStop.com

సీనియర్ నరేష్ ఈ వార్తల గురించి స్పందించినా ఆయన పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే.అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పవిత్ర లోకేశ్ తన మొదటి భర్త గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పవిత్ర లోకేశ్ భర్త పేరు సుచేంద్ర ప్రసాద్ కాగా ఈయన గురించి గతంలో పవిత్ర లోకేశ్ గొప్పగా చెప్పారు.ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కాగా గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ దూరంగా ఉంటున్నారని సమాచారం అందుతోంది.

 Pavitra Lokesh Shocking Comments About Her Husband Goes Viral Deails, Pavitra Lokesh, Pavitra Lokesh Husband, Actress Pavitra Lokesh, Suchendra Prasad , Senior Naresh, Pavitra Lokesh Naresh Marriage, -నా భర్త అలాంటి వ్యక్తి.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన పవిత్ర లోకేశ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక సీరియల్ షూటింగ్ సమయంలో పవిత్ర లోకేశ్, సుచేంద్ర ప్రసాద్ మధ్య ప్రేమ మొదలైంది.తన భర్త ఒక్క లోపం కూడా లేని వ్యక్తి అని నాతో పోల్చి చూస్తే ఆయన గొప్ప వ్యక్తి అని పవిత్ర లోకేశ్ పేర్కొన్నారు.

తన భర్త ఎంతో గౌరవంతో వ్యవహరిస్తారని మరొకరిలో అలాంటి వ్యక్తిని చూడలేమని పవిత్ర లోకేశ్ కామెంట్లు చేశారు.

తాను, తన భర్త కలిసి నటించడానికి ఛాన్స్ వచ్చినా పిల్లల కోసం ఆ ఆఫర్లను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.తన భర్త యాక్టర్ కావడంతో పాటు రైటర్, డైరెక్టర్ అని అయినప్పటికీ తన భర్త రైటర్ గానే నచ్చుతాడని ఆమె కామెంట్లు చేశారు.

తన భర్త ఇంట్లో అన్ని పనులు చేస్తాడని సమయం దొరికితే వంట కూడా చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు.అలాంటి భర్త దొరకడంతో తాను చాలా లక్కీ అని ఆమె చెప్పుకొచ్చారు.ఇంట్లో సినిమాల గురించి చర్చ జరగదని తను నటించిన సినిమాలను భర్త చూడడని ఆమె కామెంట్లు చేశారు.

అయితే పవిత్ర, సుచేంద్ర విడాకులు తీసుకోవాలని అనుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube