దెబ్బేసిన బీజేపీ : అటకెక్కిన పవన్ ' ఉక్కు ' సంకల్పం ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటే వేరు, తాను అందరు నాయకుల మాదిరిగా రాజకీయాలు చేయను, నా రాజకీయం వేరు అని, చెప్తూ ఉంటారు.దానికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారాలు ఉంటాయి.

 Janasena Pavan Troubled On Bjp Behavior In Vizag Steel Privatization , Jagan, Y-TeluguStop.com

ఇక ఉద్యమం, తీవ్రమైన ప్రజా సమస్యల విషయంలో ఎప్పుడు పవన్ అందరికంటే ముందుగానే స్పీడ్ గా రియాక్ట్ అవుతారు.ప్రజా ఉద్యమం అందరికంటే ముందుగా చేపట్టి, పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తాడు.

  మొదటి నుంచి పవన్ వైఖరి ఇదే విధంగా ఉంటూ వస్తోంది.అయితే పవన్ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అభాసుపాలు అవుతూ ఉంటారు.

ముఖ్యంగా పవన్ ఏదైనా పోరాటం ఎంచుకున్న మధ్యలోని వదిలేస్తారని , మొదలుపెట్టి ముగింపు వరకు చూడరు అని, మధ్యలోనే యూటర్న్ తీసుకుంటారనే విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ పవన్ వైఖరి అనుమానాస్పదంగా ఉండడం,  దీనికి కేంద్ర అధికార పార్టీ బిజెపి వ్యవహరించిన తీరు ఇప్పుడు జన సైనికులకు మింగుడు పడడం లేదు.

అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిన వెంటనే, అందరి కంటే ముందుగా పవన్ స్పందించారు.ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ పెద్దలకు  నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందుకు వెళ్లకుండా తాను అడ్డుకుంటాను అంటూ  చెప్పి ఢిల్లీకి వెళ్లిన బిజెపి కేంద్ర పెద్దల ముందు గట్టిగా తన వాయిస్ వినిపించలేదు  సైలెంట్ అయ్యారు.ఇక తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టమైన క్లారిటీ ఇవ్వడంతో పవన్ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతుచేశారు దీంతో పవన్ తీరుపై విమర్శలు మొదలయ్యాయి.

Telugu Bjp Behavior, Jagan, Janasena, Pavan Delhi, Pavan Kalyan, Pavan Troubled,

ఇప్పటికే బీజేపీ టీడీపీలు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ విమర్శలకు దిగుతున్నారు ఈ రెండు పార్టీలను పెద్దగా స్టీల్ ప్లాంట్ కార్మికులు సైతం పట్టించుకోవడం లేదు మూడో ప్రత్యామ్నాయంగా జనసేన ఈ వ్యవహారాన్ని సీరియస్ తీసుకుని  ప్రైవేటీకరణ అడ్డుకుంటుందని , పవన్ ద్వారా ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశపడ్డారు.ఇక జనసేన నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండగా ,ఈ విషయంలో జనసేన ఏ విధంగానూ ముందుకు వెళ్లకుండా బిజెపి పవన్ ను సైలెంట్ చేయడంతో మళ్లీ జనసేన జనాల్లో నవ్వులపాలు అయ్యింది.రాజకీయంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం జనసేన కు మంచి మైలేజ్ తీసుకు వచ్చేదే.కానీ బీజేపీ వైఖరి జనసేన  రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతూనే ఇబ్బందుల పాలు చేస్తూనే వస్తుందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.

పవన్ సంకల్పం గొప్పగానే ఉన్నా, బీజేపీ కారణంగా అది ముందుకు వెళ్లడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube