ఆ నిజం తెలుసుకున్న పవన్ ? మార్పులు తప్పవా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొంతకాలంగా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటూనే వస్తున్నారు.బలమైన సామాజిక వర్గం అండదండలు, పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నా వారి సహకారంతో రాజకీయంగా బలమైన పార్టీగా జనసేన ను తీర్చిదిద్దుదాము అని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా, ఆ ప్రయత్నాలు అన్నీ వర్క్ ఔట్ కావడం లేదు.

 Pavan Take Key Desistion About Aliance On Tdp Soon, Pavan Kalyan,  Janasena , Ys-TeluguStop.com

అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పవన్ తీసుకున్న నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోవడంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది అనే విషయం పవన్ కు బాగా తెలుసు.పవన్ కు ఉన్న చరిష్మా ను ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు మిగతా పార్టీలు ఆయనను ఉపయోగించుకున్నాయి అనే విషయం అందరికీ తెలుసు.

పవన్ తో పొత్తు పెట్టుకునే విషయంలో మొదటి నుంచి తడబడుతూనే వస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప, ఆ నిర్ణయాల కారణంగా తన ఇమేజ్ కు జనసేన పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనే విషయం పవన్ గుర్తించలేకపోతున్నారు.

ఈ విషయం జనసేన నాయకులకు బాగా తెలుసు.ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీతో కలిసి పవన్ ప్రయాణం చేస్తున్నారు.ఆ పార్టీతోనే రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని, ఉమ్మడిగా పోటీచేసి విజయం సాధించి అధికారం పంచుకోవాలని కలలు కంటున్నారు.కానీ బిజెపి మాత్రం పూర్తిగా పవన్ ను ఉపయోగించుకుని ఆయన సహకారంతో ఏపీలో అధికారం చేపట్టాలని చూస్తోంది తప్ప, జనసేన కు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరించడం లేదని విమర్శలు ఎదుర్కొంటోంది.

Telugu Aliance, Ap, Chandrababu, Ghmc, Janasena, Janasenani, Lokesh, Pavan Kalya

ఈ విషయం జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో జనసేన పోటీ చేద్దామని ప్రయత్నిస్తున్నా, ముందుగానే బిజెపి పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో మౌనంగా ఉంటున్నారు.గ్రేటర్ లో చేసిన త్యాగం గుర్తుంచుకోకుండా బిజెపి వ్యవహరిస్తున్న తీరు పవన్ కు అసంతృప్తి కలిగిస్తోంది.అలాగే మిగతా విషయాలలోను తమను పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడం కూడా అసంతృప్తిని రాజేస్తోంది.

ఇదిలా ఉంటే పార్టీ కీలక నాయకులు సైతం టిడిపి తో పొత్తు పెట్టుకుంటే జనసేన కు కలిసివస్తుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.

ఏపీలో టీడీపీ బలమైన పార్టీగా ఉండడంతో పాటు, క్షేత్ర స్థాయిలో బలం గా ఉంది.

నిత్యం వైసీపీ ప్రభుత్వం పై ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తూ హడావుడి చేస్తోంది.బిజెపి కంటే టిడిపితో కలిసి ముందుకు వెళ్తే తమకు కలిసొస్తుందనే ఆలోచనలో పవన్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

కాకపోతే బీజేపీకి శత్రువు గా మారకుండానే టిడిపి తో స్నేహం చేస్తూ, ఎన్నికల సమయానికి పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయం పై పవన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube