బీజేపీ కి పవన్ మద్దతు ... టీడీపీకి జన సైనికుల మద్దతు ? 

ఏపీ రాజకీయాల్లో జనసేన వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.ముఖ్యంగా పొత్తుల విషయంలో ఆ పార్టీ నాయకులతో పాటు, జనాల్లోనూ అనేక సందేహాలు నెలకొన్నాయి.ఎందుకంటే బీజేపీ తో జనసేన పార్టీ అధికారికంగా పొత్తు పెట్టుకుంది.2024 ఎన్నికల్లో బిజెపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని సంపాదించాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి.అయితే బిజెపితో పొత్తు ఉన్నా, విడివిడిగానే జనసేన, బీజేపీ వ్యవహారాలు చేస్తుండడం, విడివిడిగానే ఏపీ ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, స్టేట్మెంట్లు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.దీంతో ఈ రెండు పార్టీలకు మధ్య పొత్తు ఉందా లేదా అనే విషయం అందరికీ అనేక సందేహాలు అలుముకున్నాయి.

 Pavan Kalyan, Tdp, Janasena, Ysrcp, Ap Government, Bjp Janasena Alliance, Tdp Ja-TeluguStop.com

ఇదే విషయంపై బిజెపి అధిష్టానం పెద్దలు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

జనసేన, బిజెపి పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అని,  ఇందులో మరో సందేహం లేదని, రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

ఇక పవన్ కూడా బిజెపి విషయంలో ఇదే వైఖరితో ఉన్నారు.బీజేపీతో పొత్తు రద్దు చేసుకుంటే ఎదురయ్యే అన్ని  ఇబ్బందులను ఆయన ముందే పసిగట్టారు.

అందుకే బిజెపికి దూరం కాకుండానే తన రాజకీయాన్ని నడిపించాలని చూస్తున్నారు.ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బిజెపిని కలుపుకుని వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.అసలు ఏపీ లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదనే అభిప్రాయంలో ఉన్నారట.

ప్రస్తుతం 12 మున్సిపాలిటీలకు నెల్లూరు నగర పాలక సంస్థకు ఈనెల 15వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో చాలాచోట్ల జనసేన, టిడిపి అభ్యర్థులు పరిస్థితులకు అనుగుణంగా పొత్తు పెట్టుకున్నారు.

Telugu Ap, Bjpjanasena, Janasena, Pavan Kalyan, Tdpjanasena, Ysrcp-Telugu Politi

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకువీడునే పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ తెలుగుదేశం, జనసేన ,సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి 13వ వార్డుల్లో టిడిపి, ఆరు వార్డుల్లో జనసేన, ఒక వార్డులో సిపిఎం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ఇక పెనుగొండ జడ్పిటిసి ఉప ఎన్నికలలో జనసేన కి మద్దతుగా టిడిపి పోటీకి దూరంగా ఉంది.ఇలా ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా తెలుగుదేశం పార్టీతో జనసేన నాయకులు పొత్తు పెట్టుకోవడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు అధికారికంగా పొత్తు పెట్టుకునేందుకు సంకేతాలా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో తన స్పందన ఏమీ తెలియజేయడం లేదు.

పైగా బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉండడంతో, పవన్ వైఖరి ఒక విధంగా,  ఆయన పార్టీకి చెందిన నాయకుల వైఖరి మరో విధంగా ఉండడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube