రాజోలు నుంచే రాజకీయ మార్పులు ! పవన్ కొత్త వ్యూహం ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక క్షణం కూడా ఆలస్యం చేసేందుకు ఇష్టపడడంలేదు.నిత్యం ప్రజల్లో తిరుగుతూ, ప్రజల సమస్యలను హైలెట్ చేయడంతో పాటు కింది స్థాయి కార్యకర్తల నుంచి సైతం సలహాలు సూచనలు స్వీకరిస్తూ పార్టీకి మరింత బలమైన పునాదులు వేసేందుకు సిద్దమయ్యాడు.

 Pavan Politicaltour Startinrazole Janasena-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.అయితే ఈ పర్యటనలో సాధాసీదా ప్రసంగాలు చేయకుండా సరికొత్త రీతిలో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

అందులో భాగంగానే రెండు రోజుల పాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు విజ్ఞానాన్ని అందించడం సమాజం కోసం ఎలా రాజకీయం చేయాలో నేర్పించడం మాత్రమే కాదు తాను స్వయంగా వారితో మాట్లాడాలని పవన్ నిర్ణయించారు.ఈ కార్యక్రమాన్నితమ పార్టీ గెలుచుకున్న ఒకే ఒక్క సీటైనా రాజోలు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్నిగురువారం నుంచే మొదలుపెట్టబోతున్నారు.

Telugu Appavan, Janasena, Pavan, Pawantouch-Telugu Political News

జనసేనలో తమ పార్టీ కీలక నాయకులూ, కోటరీలో వ్యక్తులతో మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకునే పవన్ ఎన్నికలలో ఘోర పరాజయం నేపథ్యంలో ఇప్పుడు ఆ పంథాను మార్చుకుని సామాన్య కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండేందుకు సిద్ధమవుతున్నారు.పవన్ ఈ పర్యటనలో ప్రజలను నేరుగా కలిసి.వారి అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా దిండిలో జనసేన మేధోమధన సదస్సును గురు,శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు.జనసేనను జనానికి దగ్గర చేసేలా అభిమానులు, ద్వితీయ శ్రేణి నేతలకు కూడా దిశా నిర్దేశం చేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నాడు.ఎన్నికలకి ముందు నుంచి కానీ ఇప్పటివరకు పవన్ ను కలిసేందుకు ఒక మోస్తరు నాయకుడికి సాధ్యం అయ్యేది కాదు.

ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా మార్చాలని పవన్ భావిస్తున్నాడు.

పవన్ ఆధ్వర్యంలో ఇప్పుడు నిర్వహిస్తున్న మేథో మథనం కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవ్వడమే కాకుండా వారు చెప్పే సూచనలు, సలహాలను స్వీకరించి వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారట.

ఎన్నికల తర్వాత జనసేన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నందున దీనికి సంబందించిన ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా చేసుకుంటున్నారు.ఈ కార్యక్రమం అనుకున్న రీతిలో సక్సెస్ అయితే రానున్న రోజుల్లో కూడా మరిన్ని జిల్లాల్లో ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.

ఇక ప్రజా సమస్యల విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాలని పవన్ భావిస్తున్నాడు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్న సమయంలో జనసేన రాజకీయంగా దూకుడు పెంచడం అధికార పార్టీ వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube