పవన్ పేరు మార్చేసిన వైసీపీ మంత్రి  

Pavan Name Changed By Ysrcp Minister-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతూనే ఉంది విశాఖలో పవన్ ఇసుక దీక్ష చేసినప్పటి నుంచి వైసిపి పవన్ టార్గెట్ గా చేసుకుంది.అలాగే పవన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా వైసీపీ మీద తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాడు.నిన్న జగన్ పవన్ ను ఉద్దేశించి మూడు పెళ్లిళ్లు, ఐదుగురు పిల్లలు అంటూ కామెంట్ చేయడం కౌంటర్ గా జగన్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు కదా అంటూ పవన్ కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి.దీనికి మళ్ళీ వైసీపీ మంత్రి పేర్ని నాని స్పందించారు.

Pavan Name Changed By Ysrcp Minister- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Pavan Name Changed By Ysrcp Minister--Pavan Name Changed By Ysrcp Minister-

పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ నాయుడు అంటూ సంబోధించారు.వైసీపీ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలు పవన్ నాయుడు కి కనిపించడం లేదా ? కేవలం ఇసుక కొరత మాత్రమే కనిపిస్తుందా ? అంటూ ప్రశ్నించారు.చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి పవన్ నాయుడు రోడ్డు మీదికి వస్తున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు చెప్పింది మాత్రమే మీకు వినిపిస్తుందా అంటూ ప్రశ్నించారు.తమను పదే పదే విమర్శిస్తున్న పవన్ నాయుడు ఒక్కసారైనా చంద్రబాబును ప్రశ్నించాడా ? 1200 కోట్లు దోచుకున్న అచ్చెన్నాయుడుని పక్కన పెట్టుకొని పవన్ మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటని నాని విమర్శించారు.

Pavan Name Changed By Ysrcp Minister- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Pavan Name Changed By Ysrcp Minister--Pavan Name Changed By Ysrcp Minister-