అనుమతి ఇవ్వరా ? రోడ్డుమీదే కూర్చుంటా  

Pavan Kalyan Warning To Jagan-

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తుంటే జగన్ ప్రభుత్వం తనను అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.రైతు ప్రభుత్వం పారదర్శక పాలన అంటూ హడావుడి చేసే వైసీపీ ప్రభుత్వం తాను రైతుల సమస్యలు తెలుసుకోవాలనుకుంటుంటే ఎందుకు అడ్డుకుంటుంది అంటూ పవన్ ప్రశ్నించారు.

Pavan Kalyan Warning To Jagan- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Pavan Kalyan Warning To Jagan--Pavan Kalyan Warning To Jagan-

మదనపల్లి మార్కెట్ యార్డులో టమాటా రైతులతో సమావేశానికి అనుమతులు ఇవ్వకపోతే తాను రోడ్డుపైనే కూర్చుంటానని పవన్ హెచ్చరించారు.

తనకు ఎట్టిపరిస్థితుల్లోనూ రేపు మార్కెట్ యార్డులో రైతులతో సమావేశం నిర్వహించి తీరుతానని ఎవరు నన్ను అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.

Pavan Kalyan Warning To Jagan- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Pavan Kalyan Warning To Jagan--Pavan Kalyan Warning To Jagan-

మదనపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం అయిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.“రాయలసీమ రతనాల సీమ.రాయలవారు ఏలిన నేల.ప్రపంచానికి తత్వాన్ని నేర్పిన జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన నేల.

రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించిన నేల.అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ నేల కేవలం కొంతమంది నాయకుల గుప్పెట్లో నలిగిపోతోందని, వారి గుప్పెట్లో నుంచి రాయలసీమ ను బయటపడేసే వరకు తనకు ఈ విధంగానే ముందుకు వెళ్తానని పవన్ హెచ్చరించారు.

తాజా వార్తలు

Pavan Kalyan Warning To Jagan Related....