ఆ సహాయంపై 'ట్విట్టిన' పవన్ !   Pavan Kalyan Tweet On Titli Publicity By Ap Government     2018-11-12   16:36:15  IST  Sai M

ఏపీ ప్రభుత్వం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుఫాను ను ప్రభుత్వం రాజకీయంగా వాడుకుందని…. వారికి చేసిన సహాయాన్ని కూడా … ప్రభుత్వం ప్రచారానికి వాడుకోవడం తగదని పవన్ విమర్శించారు. ఈమేరకు ఇవాళ ఆయన ఓ ట్వీట్‌ చేశారు.

‘తిత్లీ బాధితులకు టీడీపీ ప్రభుత్వం చేసింది గింజంతా.. కానీ ప్రచారం మాత్రం ఎవరెస్ట్‌ రేంజ్‌లో ఉంది. టీడీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.. అతి ప్రచారమే కొంప ముంచుతుందనే అబ్రహం లింకన్‌ కోట్‌ గుర్తుకు వస్తుంది’ అని పవన్‌ పోస్ట్‌ చేశారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.