స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి పవన్ ? 

జేపీ పై తీవ్ర ఆగ్రహా, ఆవేశలతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.బిజెపికి తాము ఎంత మేలు చేస్తున్న, ఆ పార్టీ గుర్తించకపోగా తమను అవమానించేలా వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో ఆ పార్టీ తో తాడో పేడో అన్నట్టు గా పవన్ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

 Pavan Kalyan Try To Entered On Steel Plant Momnet-TeluguStop.com

అవసరమైతే బిజెపితో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా ముందుకు వెళ్లేందుకు సైతం పవన్ సిద్ధమవుతున్నారట.అందుకే అన్నిటికీ తెగించి మరీ బిజెపిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో మళ్లీ బీజేపీ కోసం జనసేన త్యాగం చేసింది.అంతకుముందు జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి కోసం జనసేన నుంచి తప్పుకుంది.

అయినా బిజెపి అగ్రనాయకులు నుంచి స్థానిక నాయకులు వరకు ఎవరు జనసేన విషయంలో సానుకూలంగా ఉండకపోగా, తమపై నిందలు వేస్తున్న తీరుతో పవన్ తీవ్రంగా అసంతృప్తి కి గురైయ్యారట.కొద్దిరోజుల పాటు వేచి చూసి బిజెపి అగ్రనేతలు నుంచి పిలుపు రాకపోయినా, తనకు, తమ పార్టీకి ప్రాధాన్యం కల్పించే విధంగా బిజెపి అగ్రనాయకులు నిర్ణయం తీసుకోకపోయినా తమ దారి తాము చూసుకోవాలని, అవసరమైతే విశాఖ ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహించి బీజేపీని ఇరుకున పెట్టేందుకు సిద్దమవుతున్నారట.

ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పవన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని, ఆయన దీంట్లో పాల్గొంటే ఈ ఉద్యమానికి ఊపు వస్తుందని ఆశలు భారీగానే పెట్టుకున్నారు.

Telugu Ap, Janasena, Muncipal, Pavan Kalyan, Steel, Tirupathi, Vizag, Ysrcp-Telu

నీ బీజేపీతో పొత్తు కారణంగా ఇష్టం లేకపోయినా, నష్టం జరుగుతుంది అని తెలిసినా ప్రైవేటీకరణకు పవన్ మద్దతు పలికారు.బిజెపి కోసం వాటిని భరిస్తూ వస్తున్నారు.అయితే బిజెపి వైఖరి మారకుండా ఇదే విధంగా ఉంటే , స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నాయకత్వం వహించి తమ పలుకుబడి పెంచుకునేందుకూ పవన్ సిద్ధం అవుతున్నారట.

ఏది ఏమైనా పవన్ చాలా డేరింగ్ స్టెప్పే వేసేలా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube