పవన్ కు వాస్తవం బోధపడిందా ? ఇక కీలక నిర్ణయమైనా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం గా ముందడుగు వేసే ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు.ప్రస్తుతం బీజేపీతో కలిసి అడుగులు వేస్తున్న పవన్ ఆ పార్టీతో కలిసి అడుగులు వేయడం పెద్ద అనుమానంగానే ఉంది.

 Pavan Kalyan Take Key Decision About Bjp Alliance-TeluguStop.com

ఎందుకంటే ఏపీలో బీజేపీ తో పోల్చుకుంటే జనసేన పార్టీ బలంగా ఉంది.బలమైన కేడర్ తో పాటు, పార్టీ పిలుపు ఇచ్చినా, ఇవ్వకపోయినా జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లే నాయకులకు కొదవే లేదు.

అదీ కాకుండా ఇటీవల పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తో పోలిస్తే జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది.జనసేన పార్టీ అధికారంలోకి తీసుకురావాలనే కసి బాగా కనిపిస్తోంది .కానీ బీజేపీతో కలిసి ఉంటే అది నెరవేరదు అని పవన్ నమ్ముతున్నారు.

 Pavan Kalyan Take Key Decision About Bjp Alliance-పవన్ కు వాస్తవం బోధపడిందా ఇక కీలక నిర్ణయమేనా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బిజెపికి దూరమైనా, ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఫలితం ఏ విధంగా ఉంటుందో 2019 లో అర్థమైంది.

అప్పుడు ఏపీలో పెద్ద బలం లేని బిఎస్పి వంటి పార్టీలతో కలిసి వెళ్లినా, పెద్దగా ప్రయోజనం కలగలేదు.అసలు 2019లో ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయి పోవడానికి ప్రధాన కారణం జనసేన కు పెద్దగా క్యాడర్ లేకపోవడమే.

  కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు జనసేన కు బలమైన పునాదులు ఏర్పడినట్లు గా కనిపిస్తున్నాయి.గ్రామస్థాయి నుంచి జనసేన బాగా బలోపేతం అయినట్టుగా కనిపిస్తోంది.పవన్ ఎన్నికల ప్రచారం పాల్గొనకపోయినా, స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన ప్రభావం కనిపించింది.ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు బలమైన పునాదులు పడ్డాయని పవన్ నమ్ముతున్నారు.

Telugu Alliance, Bjp, Chandrababu Naidu, Elections, Jagan, Janasena, Janasena And Bjp Alliance, Modhi, Pawan Kalyan, Pawan Key Decision, Tdp, Tirupati Elections, Ysrcp-Telugu Political News

  ఏపీలో అధికారంలోకి రావాలంటే బిజెపితో కలిసి ఉంటే అది సాధ్యం కాదని పవన్ నమ్ముతున్నారు.గతంలో పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు.బీజేపీ తీరుపై జనాల్లో ఉన్న ఆగ్రహం ఇవన్నీ లెక్క వేసుకుంటున్న పవన్, తిరుపతి లోక్ భ ఉప ఎన్నికల తరువాత బీజేపీ కి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే పవన్ టీడీపీ తో జత కట్టేందుకు అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

#Jagan #Pawan Kalyan #Alliance #Ysrcp #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు