జగన్ ను మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నపవన్  

Pavan Kalyan Strong Reply To Cm Jagan-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.నిన్న ఒంగోలు లో జరిగిన సభలో పవన్ ను ఉద్దేశించి మీకు ముగ్గురు భార్యలు ఉన్నారు వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు వారు ఏ మీడియం లో చదువుతున్నారు అంటూ జగన్ ఎటకారంగా మాట్లాడారు.అయితే దీనిపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని, కేవలం పవన్ మాత్రమే స్పందిస్తారని ఆ పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై నేడు పవన్ స్పందించారు.

Pavan Kalyan Strong Reply To Cm Jagan- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Pavan Kalyan Strong Reply To Cm Jagan--Pavan Kalyan Strong Reply To Cm Jagan-

తాను సరదాపడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి ఎవరు వద్దన్నారంటూ పవన్ ఘాటుగా రిప్లై ఇచ్చారు.నేను మూడు పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లి వచ్చారా అంటూ పవన్ ప్రశ్నించారు.తాను విధానాలపై, సమస్యలపై మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను కూడా వైసీపీ నేతలవలే మాట్లాడగలనని కానీ అలా మాట్లాడానని పవన్ చెప్పుకొచ్చారు.

Pavan Kalyan Strong Reply To Cm Jagan- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Pavan Kalyan Strong Reply To Cm Jagan--Pavan Kalyan Strong Reply To Cm Jagan-

జగన్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా అసలు సమస్య పక్కకు వెళ్ళిపోతుందని అందుకే ఈ విషయంలో ఎవరిని స్పందించవద్దని సూచించానని పవన్ అన్నారు.మీ ట్రాప్‌లో జనసేన నేతలు పడరని వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తాను వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుంటే కేవలం ఆ పార్టీకి చెందిన కాపు నాయకులు మాత్రమే స్పందిస్తున్నారని మిగతా సామజిక వర్గాల నేతలతో కూడా తనను విమర్శలు చేయంచవచ్చని పవన్ జగన్ కు సూచించారు.