పవన్ పర్యటనలో దొంగల హడావుడి  

Thiefs Robbed In Pavan Kalyan Meeting-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు.రాజకీయంగా తాను నిలదొక్కుకునేందుకు, వైసీపీ కి రాయలసీమలో ఉన్న బలాన్ని తగ్గించేందుకు పవన్ ఈ ప్రాంతంలో పర్యటన చేస్తున్నాడు.ఈ పర్యటనలో పవన్ నేరుగా ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ పర్యటనల ద్వారా రాయలసీమలో పార్టీకి బలమైన పునాదులు వేయాలని పవన్ భావిస్తున్నాడు.

Thiefs Robbed In Pavan Kalyan Meeting- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Thiefs Robbed In Pavan Kalyan Meeting--Thiefs Robbed In Pavan Kalyan Meeting-

దీనిలో భాగంగానే పవన్ రేణిగుంట విమాశ్రయానికి చేరుకోగానే జేబు దొంగతలు తమ పనికి పదును పెట్టారు.పవన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడడంతో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట జరిగింది.ఇదే సరైన సమయమని భావించిన జేబు దొంగలు సుమారు 40 మంది పర్సులు, మొబైల్ ఫోన్ లు కాజేశారు.అయితే ఇందులో బాధితులు కేవలం అభిమానులే కాదు జనసేన కీలక నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సంఘటనపై పవన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.