పవన్ పర్యటనలో దొంగల హడావుడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు.రాజకీయంగా తాను నిలదొక్కుకునేందుకు, వైసీపీ కి రాయలసీమలో ఉన్న బలాన్ని తగ్గించేందుకు పవన్ ఈ ప్రాంతంలో పర్యటన చేస్తున్నాడు.

 Pavan Kalyan Meeting-TeluguStop.com

ఈ పర్యటనలో పవన్ నేరుగా ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ పర్యటనల ద్వారా రాయలసీమలో పార్టీకి బలమైన పునాదులు వేయాలని పవన్ భావిస్తున్నాడు.

దీనిలో భాగంగానే పవన్ రేణిగుంట విమాశ్రయానికి చేరుకోగానే జేబు దొంగతలు తమ పనికి పదును పెట్టారు.

పవన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడడంతో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట జరిగింది.

ఇదే సరైన సమయమని భావించిన జేబు దొంగలు సుమారు 40 మంది పర్సులు, మొబైల్ ఫోన్ లు కాజేశారు.అయితే ఇందులో బాధితులు కేవలం అభిమానులే కాదు జనసేన కీలక నాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సంఘటనపై పవన్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube