ప్రధానితో పవన్ భేటీ ? కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ?  

Pawan Meets Pm To Make A Key Decision?-bjp,janasena,narendra Modi,pavan Kalyan,pawan,పవన్ భేటీ

జనసేన బిజెపి రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఆ రెండు పార్టీల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బిజెపి సహాయంతో ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించాలని పవన్ భావిస్తుండగా, పవన్ సహకారంతో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

Pawan Meets PM To Make A Key Decision?-Bjp Janasena Narendra Modi Pavan Kalyan Pawan పవన్ భేటీ

ఈ నేపథ్యంలోనే రాజకీయంగా పవన్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు బిజెపి సిద్ధమైంది.నేడు ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ మేరకు పవన్ కు అపాయింట్మెంట్ కూడా ఉన్నట్టు సమాచారం.ఇక ముందు నుంచి రాజధానిగా అమరావతి ఉండాలని గట్టిగా చెబుతున్న పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మరింతగా దూకుడు పెంచారు.

అమరావతి ఎక్కడికి వెళ్లాడని, అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందంటూ గట్టిగా చెబుతున్నారు.

ఢిల్లీ పర్యటనలో కూడా ఇదే విషయమై కేంద్ర పెద్దలతో చర్చించి బలమైన హామీని తీసుకోబోతున్నట్లు సమాచారం.

అదీ కాకుండా ఈ రోజు ఢిల్లీలో బిజెపి జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో బీజేపీ అగ్రనేతలతో పాటు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు.ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని మార్పు పై పవన్ ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నారు.

ఇక తన ఢిల్లీ పర్యటనపైనా పవన్ స్పందించా.రైతులు ఆందోళన, ఆవేదన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగక తప్పదని పవన్ చెబుతున్నారు.

ఈ రెండు పార్టీలు అమరావతి ఉద్యమంపై పెద్దఎత్తున పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి.

 రాజధానిని మార్చే ఉద్దేశం జగన్ కి లేదంటూ బీజేపీ చెబుతుంటే, అసలు రాజధాని ఇంచు కూడా కదలదని జనసేన చెబుతోంది.దీంతో ఈ రెండు పార్టీలకు ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.బిజెపి జనసేన పొత్తు తర్వాత కలిసి చేయబోతున్న మొదటి కార్యక్రమంగా అమరావతి ఉండబోతుందట.

చాలా రోజులుగా పవన్ కేంద్ర పెద్దలు ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ వారి అప్పోయింట్మెంట్ పవన్ కి దక్కడంలేదు.ఈ రోజు ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం దక్కడంతో పవన్ రాజకీయంగా కొన్ని హామీలను ప్రధాని నుంచి తీసుకోబోతున్నట్టు సమాచారం.

తాజా వార్తలు

Pawan Meets Pm To Make A Key Decision?-bjp,janasena,narendra Modi,pavan Kalyan,pawan,పవన్ భేటీ Related....