మరో డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. త్వరలోనే సెట్స్ మీదకి?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న పవన్.

 Pavan Kalyan Gave Green Signal For New Script-TeluguStop.com

మరిన్ని క్రేజీ సినిమాలతో అభిమానుల ముందుకు రానున్నాడు.చాలా రోజుల గ్యాప్ తర్వాత సినిమాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వరుస ప్రాజెక్టులను నింపుకుంటున్నాడు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కగా మంచి విజయాన్ని అందుకుంది.

 Pavan Kalyan Gave Green Signal For New Script-మరో డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. త్వరలోనే సెట్స్ మీదకి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత అనగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు.అంతేకాకుండా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు వరుస లో ఉండగానే.మరో డైరెక్టర్ తో సినిమా ఉంటుందని తెలిపారు.

గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నట్లు అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి.ఇక ఇటీవలే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు పూర్తి స్క్రిప్ట్ ను కూడా వినిపించారని తెలిసింది.

ఈ స్క్రిప్ట్ పవన్ కు నచ్చగా.సంతృప్తికరంగా ఉందని తెలిపాడట‌.

ఇక ఈ సినిమా షూటింగ్ ను జూలై నుంచి మొదలు పెట్టమని, నెలకు పది రోజులు తన పోర్షన్ ను షూట్ చేయమని తెలిపారట.ఇక దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఓకే అన్నాడట‌.

ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలిపారు.ఇక ఈ సినిమాకు ‘సంచారి’ అనే పేరు పరిశీలన లో ఉండగా ఇంకా ఫిక్స్ కాలేదని అర్థమవుతుంది.

#New Csript #Pawan Kalyan #Harish Shankar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు