పవన్ బాగా పుంజుకున్నాడే ! వైసీపీ భయం అదేనా ?

జనసేన పార్టీ అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క సీటు కు పరిమితం అయినా మెజార్టీ స్థాయిలో 151 స్థానాలను దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని హడలెత్తిస్తోంది.ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలతో టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.

 Pavan Kalayn Getting Speed Up In Ap Politicals-TeluguStop.com

అయితే ప్రజా పోరాటం విషయంలో టిడిపి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పెద్దగా ఎఫెక్ట్ కనిపించడంలేదు.టీడీపీ పోరాట తీవ్రతను కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు.

దీనికి కారణం ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్.ప్రస్తుతం జనసేన వైసీపీల మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయిలో ఉంది.

ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్సించుకునే స్థాయికి వెళ్లి పోయారు.ఈ విషయంలో ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

వైసీపీకి ఇప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా ఉన్నారా అంటే అది జనసేన మాత్రమే అన్నట్టుగా ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.

Telugu Apcm, Janasenapawan, Pavan Kalayn, Pavankalayn, Pawankalyan, Pawanlong-

వాస్తవంగా చెప్పుకోవాలంటే ఐదు నెలల పరిపాలనా కాలంలో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గాని, సంస్కరణలు గాని ఇప్పటి వరకు పనిచేసిన ఏ ముఖ్యమంత్రి చేయలేదనే చెప్పాలి.ఐదు నెలల కాలంలో ఇంత ఆర్థిక భారం అయిన పథకాలను అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు.అయినా జగన్ గుండె ధైర్యంతో ముందుకు వెళుతూ వాటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో వైసీపీకి ఎక్కడలేని పాపులారిటీ రావాలి.కానీ ఏపీలో ఇసుక కొరత ఆ క్రెడిట్ రాకుండా అడ్డు పడుతోంది.

Telugu Apcm, Janasenapawan, Pavan Kalayn, Pavankalayn, Pawankalyan, Pawanlong-

జనసేన, టిడిపి, బిజెపి పార్టీలకు ఇప్పుడు ఇదే ప్రధాన అస్త్రంగా మారింది.ప్రస్తుతం ఏ విషయాలు మీద పెట్టడానికి ఆ పార్టీలకు అవకాశం లేదు.అందుకే ఇసుక రాజకీయం నడుస్తోంది.విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ పవన్ లో ఒకరకంగా కొత్త ఉత్సాహాన్నినింపింది.ఇక అప్పటి నుంచి జనాల్లోనే నిత్యం ఉండాలని పవన్ డిసైడ్ అయిపోయాడు.

Telugu Apcm, Janasenapawan, Pavan Kalayn, Pavankalayn, Pawankalyan, Pawanlong-

ప్రభుత్వాన్నిఇరుకున పెట్టే ఏ చిన్న సంఘటన జరిగినా టిడిపి కంటే ముందే పవన్ మేల్కొంటున్నాడు.ఆ సమస్యను హైలెట్ చేస్తున్నాడు.రాజధాని విషయంలోనూ ఆయన వేలు పెట్టాడు.

రాజధాని అమరావతి మరో ప్రాంతానికి తరలిస్తారని ప్రచారం నేపథ్యంలో పులివెందులలో పెట్టండి, హైకోర్టు కర్నూల్ లో ఏర్పాటు చేయండి అంటూ వెటకారం చేశాడు.ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపైనా ఈ రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది.

ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ రాజకీయ రచ్చ చేస్తున్నారు.వచ్చే ఎన్నికల నాటికి తాము బలపడాలంటే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే అని పవన్ ఒక నిర్ణయానికి రావడంతో ఇప్పటి నుంచే ఆ పనికి శ్రీకారం చుట్టాడు.

ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనుకబడి పోయినట్టే అనిపిస్తోంది.అకస్మాత్తుగా పవన్ ఇలా రాజకీయంగా పుంజుకోవడం వైసీపీఎలేవు కలవరం పుట్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube