అవకాశం ఇస్తానని ఆ దర్శకుడు నన్ను వాడుకున్నాడంటున్న పవన్…  

Pavan, jabardasth comedian, Amma Rajasekhar, Dance Choreographer, Tollywood - Telugu Amma Rajasekhar, Dance Choreographer, Jabardasth Comedian, Pavan, Tollywood

మామూలుగా సినీ పరిశ్రమకు ఎంతో మంది యువ నటీ నటులు ఎన్నో కలలతో, ఆశలతో వస్తుంటారు.అయితే ఇందులో  కొంత మంది సినీ అవకాశాల పేరుతో చేసేటటువంటి మోసాలకు గురవుతుంటారు.

 Pavan Jabardasth Comedian Amma Rajasekhar

అయితే జబర్దస్త్ కామెడీ షోలో తన లేడీ గెటప్ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే  కమెడియన్ పవన్ గురించి ప్రేక్షకులకు కొత్తగా తెలియ జేయాల్సిన అవసరం లేదు.తాజాగా పవన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా మొదట్లో సినీ దర్శకుడు మరియు డాన్స్  కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దగ్గర కొద్ది రోజుల్లో పని చేశానని ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మభ్య పెట్టాడని చెప్పుకొచ్చాడు.దీంతో తన ఇంట్లో ఒక పని మనిషిగా చేయాల్సిన అన్ని పనులను చేశానని అయితే అమ్మ రాజశేఖర్ ని తన సినిమా అవకాశం గురించి అడిగినప్పుడు మాత్రం ఏదో ఒక సాకు చెప్పి దాటవేస్తూ వచ్చేవాడని తెలిపాడు.

అవకాశం ఇస్తానని ఆ దర్శకుడు నన్ను వాడుకున్నాడంటున్న పవన్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇక చేసేదిమీ లేక తనకు తన చిత్రంలో అవకాశం ఇస్తారా లేదా అని గట్టిగా నిలదీయడంతో తనపై కొంతమేర సీరియస్ అయ్యాడని అందువల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయానని ఎమోషనల్ అయ్యాడు.

ఆ తరువాత ఎన్నో కష్టాలు పడ్డానని చివరికి తెలిసిన వారి ద్వారా జబర్దస్త్ కామెడీ షోలో అవకాశం దక్కించుకున్నాని ఇప్పుడు ప్రస్తుతం బాగానే రాణిస్తుందని తెలిపాడు.

అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతోంది.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ చాలా మందికి సొంతంగా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సత్తా ఉన్నప్పటికీ సినీ పరిశ్రమలోని ప్రముఖులమని చెప్పుకుని తిరిగే వారిపై ఆధార పడుతున్నారని ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది ఏకంగా సెలబ్రిటీలకు దగ్గరి బంధువులమని చెప్పుకుంటూ ఏకంగా అవకాశాల కోసం వచ్చే వారితో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా కొంచెం ఉన్నారు.

#Pavan #Amma Rajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pavan Jabardasth Comedian Amma Rajasekhar Related Telugu News,Photos/Pics,Images..